మన్మోహన్ పై మోదీ దే పై చేయి – షీలా దీక్షిత్

Google+ Pinterest LinkedIn Tumblr +

దేశం అంతటా.. ఎన్నికలు దేగ్గరపడుతున్నాయి.. ఒకరి పై ఒకరు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. విమర్శల్లో కూడా ఒకరి పై ఒకరు పోటీ పడుతున్నారు. ఇలాంటి సమయంలో కామెంట్ చేయకపోయిన అలా అని నోరు జారిన కష్టమే.. అసహనంగా ప్రతిపక్షం వారిని కామెంట్ చేసినా లేక తమ సొంత పార్టీ వారిపై ఏదైయన కామెంట్ చేసినా అది వారికే నష్టం.

దాదాపుగా ఎవ్వరూ ఇలా తమ సొంత పార్టీ వారిపై కామెంట్ చేసుకోరు ఆచ్చితూచి వ్యవహరిస్తారు. కానీ ఢిల్లీ మాజీ సీఎం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షీలా దీక్షిత్ తమ సొంత పార్టీ నాయకుడైన మన్మోహన్ సింగ్ పై సంచలనమైన కామెంట్స్ చేసింది. ఉగ్రవాదాన్ని అనచి వేయడంలో మన్మోహన్ కంటే మోదీ ఏ మేలని ఆమె పేర్కొంది.

తాజాగా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె తన సొంత పార్టీ అయిన కాంగ్రెస్ గురించి కాంగ్రెస్ పార్టీ స్టాంప్ ప్రధాని అయిన మన్మోహన్ గురించి కొన్ని సంచలనమైన కామెంట్స్ చేసింది. ప్రత్యర్ద పార్టీ ప్రధాని కి ఆమె అనుకూలంగా మారింది… ప్రధాని మోదీతో పోలిస్తే నాటి ప్రధాని మన్మోహన్ సింగ్..ఉగ్రవాదాన్ని బలంగా ఎదుర్కోలేకపోయారని ఆమె వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ ఉగ్రవాద నిర్మూలనకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారని పరోక్షంగా అంగీకరించారు.

ఐతే రాజకీయ లబ్ధి కోసమే పాకిస్తాన్ పట్ల మోదీ దూకుడుగా వ్యహరిస్తున్నారని షీలా దీక్షిత్ స్పష్టంచేశారు. బాలాకోట్‌లో జైషే మహ్మద్ ఉగ్రవాద శిక్షణా కేంద్రంపై వైమానికదాడులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు షీలా దీక్షిత్. ఉగ్రవాదాన్ని మన్మోహన్ కంటే మోదీయే ధీటుగా ఎదుర్కొన్నారన్న ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి.

Share.

Comments are closed.

%d bloggers like this: