మాయావతి మార్గం ఉత్తమం..! అందుకే బీఎస్పీ తో పొత్తు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

వామ పక్షా పార్టీలతో పొత్తులో ఉంటామని వారితో కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్ మరూ కీలక నిర్ణయం తీసుకున్నారు. జాతీయ స్థాయి పార్టీ బీఎస్పీ తో కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నామని ఆయన ప్రకటించారు. శుక్ర వారం ఉత్తర్ ప్రదేశ్ లోని లఖ్నవ్ వెళ్ళిన పవన్ బీఎస్పీ అధినేత మాయావతి తో సమావశమయ్యారు, కొంత సేపు ఆమె తో చర్చలు జరిపారు.

ఆమెతో భేటీ ముగిసిన అనంతరం పవన్ మీడియా తో మాట్లాడారు.. ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో బీఎస్పీతో కలిసి పోటీ చేస్తామనిస్పష్టం చేశారు పవన్‌ కళ్యాణ్‌. డా.బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని అందువల్లే బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నట్లు తెలిపారు. మాయావతి మార్గం చాలా ఉత్తమమని అందుకే ఆమె తో ముందుకు పోవాలని భావించామని ఆయన స్పష్టం చేశారు.. తెలుగు రాష్ట్రాలలో సామాజిక న్యాయం అందరికీ అందించాల్సిన అవసరం తమపై ఉందన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: