ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దేగ్గరాపాడుతున్నాయి, అధినేతలు కార్యకర్తలు ప్రచారం లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. జిల్లాల వారీగా పార్టీ అభ్యర్థులు కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి లోకేష్ తన నియోజకవర్గమైన మంగళగిరి లో ప్రచారం మొదలు పెట్టేశారు. తాను పోటీ చేయబోయే మంగళగిరి నియోజకవర్గంలో తొలిసారి క్యాంపెయిన్‌ను చేపట్టారు. చర్చ్ లో మస్జిద్ లో దేవలాయాలలో ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మత పెద్దల దేగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నారు.
అనంతరం కార్యకర్తల సభలో లోకేష్ మాట్లాడారు మనగలగిరి ప్రజలకి వారాల వర్షం కురిపించారు. ఇప్పటికే అక్కడ చాలా ఐటీ కంపెనీలని ఆయన తీసుకొచ్చారని ఇక పై మరెన్నో తీసుకొస్తామని ఆయన అన్నారు. ఆయన మాట్లాడుతూ.. మంగళగిరి నియోజకవర్గానికి తాను మూడేళ్ల క్రితమే ఓటు హక్కును మార్చుకున్నట్టు చెప్పారు. మంగళగిరిని మరో గచ్చిబౌలిగా మారుస్తామని ఈ సందర్భంగా లోకేష్ హామీ ఇచ్చారు. ఐటీ మంత్రిగా తాను మంగళగిరి నియోజకవర్గానికి ఎన్నో ఐటీ కంపెనీలను తీసుకొచ్చానని లోకేష్ చెప్పారు. వచ్చే ఐదేళ్లలో మరిన్ని ఐటీ కంపెనీలను తీసుకొస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. యువతీ యువకులకు సొంత జిల్లాలోనే ఉపాధి కల్పించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నారని లోకేష్ అన్నారు.
ప్రతిపక్ష వైసీపీ మీద లోకేష్ విమర్శలు గుప్పించారు. వైసీపీ ఒక డ్రామా పార్టీ అని అందులోని నేతలందరూ అద్భుతమైన డ్రామా యాక్టర్స్ అని ఆయన విమర్శించారు. ఎన్నికలు రావని తెలిసిన తర్వాత ఆ పార్టీ ఎంపీలు రాజీనామా చేసి.. తాము ఏడాది ముందే రాజీనామా చేశామంటూ డ్రామా చేశారని లోకేష్ విమర్శించారు. రాష్ట్రంలో అలజడి సృష్టించడానికే కోడికత్తి దాడి డ్రామా ఆడారని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి భద్రత కోసం ఏపీ పోలీసులు కావాలి కానీ, కేసుల విచారణకు మాత్రం అవసరం లేదని లోకేష్ ఎద్దేవా చేశారు అందుకే ఏం జరిగినా సిట్ అంటున్నాడని మండి పడ్డాడు.