వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి నేడు తెల్లవారుజామున మృతి చందాడు. ముందు గుండెపోటుతో మరణించాడని వార్తలొచ్చినప్పటికి ఆ పరిసరాలు ఆయన శవం అనుమానాస్పద రీతిలో రక్తం మడుగుల్లో కనిపించేసరికి పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇక కేసు నమోదు చేసుకొని ప్రత్యేక విచారణ బృందం అక్కడికి రంగంలోకి దిగింది. ఇక పోస్ట్ మార్టం నిమిత్తం ఆయన శరీరాన్ని ఆసుపత్రికి తరలించారు.
పోస్ట్ మార్టం నిమిత్తం ఇది హత్యో లేక సాధారణ మరణమొ కాస్త క్లూ దొరుకే ఛాన్స్ ఉంటుందని అక్కడి పోలీసులు చెప్పారు. ఇక పోస్ట్ మార్టం రిపోర్ట్ తో ఆయనది హత్యే అని తేలిపోయింది. అందరి అనుమానమే ఇప్పుడు నిజంగా మారింది. పోస్ట్ మార్టం లో ఆయన వంటి పై ఏడు కత్తి పోట్లు ఉన్నాయని తేలింది.
తల వెనుక భాగంలో బలమైన గాయమైనట్లు గుర్తించారు. నుదుటిపై రెండు చోట్ల లోతైన గాయాలున్నాయి. తొడ, చేతి వేళ్లపైనా గాయాలున్నట్లు తేలింది. దీంతో వైఎస్ వివేకానంద రెడ్డిది హత్యగానే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కేసులో అన్నీ కొనాలని ప్రత్యేకంగా విచారిస్తున్నామని కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మా వెల్లడించారు.