మనవరాలిని తల్లిని చేసిన కామాందుడు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

కోయిలకుంట్ల మండలం ఉప్పలూరు గ్రామంలో మైనర్ బాలికపై ఆమె తాత అయిన ఓ కామాంధుడు అత్యాచారం చేసి భయభ్రాంతులకు గురిచేసాదు. అలా సంవత్సర కాలంగా బాలికపై అత్యాచారం చేస్తూ ఇప్పుడామెను గర్భవతిని చేశాడు… అభం శుభం తెలియని ఆ బాలిక భయంతో కామాందునికి బలయ్యింది… ఈ హృదయ విదారక సంఘటనతో ఉప్పలూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి…

అజ్ఞానం నిరక్షరాస్యత విరిసి ఆ బాలిక పాలిట శాపంగా మారాయి.. నమ్మిన వారే నయవంచనతో అఘాయిత్యానికి ఒడిగట్టింది దీంతో… ఆ బాలిక తండ్రి మనోవేదనకు హద్దులు లేవు.. కన్నతల్లి బాలిక ఆరు సంవత్సరాల వయస్సులోనే చనిపోవడంతో ఆమె మారు తల్లి నిర్లక్ష్యం బాలిక పాలిట శాపంగా మారాయి…. వారికి జీవనాధారమైన గొర్రెలు కాసెందుకు వెళుతున్న బాలికకు రక్షణగా ఉంటాడని తాత వరుసైన జింకల పుల్లయ్య తోడుచేసి పంపగా బాలికను లోబరుచుకొని అత్యాచారం చేసి భయభ్రాంతులకు గురి చేశాడు…బయటికి చెబితే చంపేస్తానని బెదిరించి తరుచూ అత్యాచారం చేసేవాడు.. సంవత్సర కాలంగా ఈ అఘాయిత్యం చేస్తూనే ఉన్నాడు… దీంతో బాలిక గర్భం దాల్చింది…

ఏడు నెలల గర్భం కావడంతో బాలిక బాధపడుతూ ఉండడంతో తండ్రి ,మారుతల్లి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.. వైద్య పరీక్షలు చేసిన వైద్య సిబ్బంది గర్భం దాల్చిందని ఏడవ నెల అని ని చెప్పడంతో తల్లిదండ్రులు అవక్కు అయినారు…దీనిపై బాలికను నిలదీయగా జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది… దీంతో అఘాయిత్యానికి పాల్పడిన జింకల పుల్లయ్యను నిలదీయగా పరారయ్యాడు…

బాధితులు రేవనూరు పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఫిర్యాదు చేశారు… గ్రామంలో అభం శుభం తెలియని బాలికపై గత కొంతకాలంగా అత్యాచారానికి పాల్పడిన మానవ మృగం పై బాలిక తల్లిదండ్రులు రెవనూరు పోలీసులు కు పిర్యాదు చేసారు సమాజం తలదించుకునేలా చోటు చేసుకున్న ఈ దారుణ ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాలికను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు బాధితురాలు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం సెక్షన్ 6, ఐపీసీ 367 సెక్షన్ క్రింద కేసు నమోదు చేసినట్లు ఆళ్లగడ్డ డి.ఎస్.పి తిప్పేస్వామి ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Share.

Comments are closed.

%d bloggers like this: