లక్ష్మిస్ ఎన్టిఆర్ సినిమాని నిలిపివేయాలంటూ టీడీపీ కీ చందిన కార్యకర్త దేవీబాబు చౌదరి ఎన్నికల కమిషన్ ని కోరాడు. సినిమాలో తమ అధినేత చంద్రబాబు ని నెగిటివ్ గా చూపించారని దాంతో వోటర్లపై ప్రభావితం పడుతుందని ఆయన ఆరోపించాడు.. ఈ మేరకు ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేశారు. మొదటి విడత పోలింగ్ పూర్తయ్యెంత వరకు సినిమా విడుదలని నిలిపి వేయాలని ఆయన కోరారు.
ఈ ఫిర్యాదుపై ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ స్పందించారు. సినిమా లో ఎన్నికలకీ సంబందించి ఎన్నికల కోడ్ ని నిష్క్రమించే రీతిలో ఏమైయన సన్నివేశాలు ఉన్నా గాని సినిమా కథ లో వోటర్లని ప్రలోభ పెట్టె సన్నివేశాలు ఉన్నా.. ఏవైనా దృశ్యాలలో పార్టీ కి ఓట్లు వేయమని అడుగుతున్నట్టుగా ఉన్నా అవి ఎన్నికల కోడ్ కి విరుద్ధమని.. ఒకసారి పూర్తిగా వివరాలు సేకరించి సినిమా ని పూర్తిగా పరిశీలించిన తరువాతే ఏమైయన అవసరం ఉంటే చర్య తీసుకుంటామని ఒకవేళ అలా ఏమి జరగక పోతే సినిమాని చిత్రా యూనిట్ ఎప్పుయదైన రిలీజ్ చేసుకోవచ్చని ఆయన తెలియజేశారు.
ఇక ఈ విషయానికి స్పందిస్తూ.. ఆర్జివి సినిమా ని విడుదల కాకుండా ఎవ్వరూ ఆపలేరని అలాంటి శక్తి ఎవ్వరికీ లేదని ఒకవేళ అలా ఆపితే ఆయన కూడా కోర్ట్ ని ఆశ్రయిస్తానని పేర్కొన్నాడు. ఇక ఈ వ్యవహారం చూస్తుంటే ఈ సినిమా విడుదల తరువాత ఏదో సంచలనం సృష్టిస్తుందని అందరూ అనుకున్నారు కానీ ఈ సినిమా రిలీజ్ కి ముందు నుంచే సంచలనాలని సృష్టిస్తూ వస్తుందని అర్ధం అవుతుంది.