ప్రీ రిలీజ్ బిజినెస్ లో దూసుకుపోతున్న మజిలీ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నాగ చైతన్య సమంతా జంటగా నటిస్తున్న సినిమా మజిలీ.. సినిమా ని ఇప్పటికీ పూర్తి చేసేశారు ఇక రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాని శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. నిన్ను కోరి సినిమా తో మంచి హిట్ అందుకున్న శివ ఈ సినిమా ని కూడా చాలా బాగా తెరకెక్కించాడు అనే చెప్పాలి.. ఎందుకంటే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ అందుకుంటుంది. ఇక అక్కినేని అభిమానులు ఈ సినిమా ట్రైలర్ తో చైతు నుంచి మంచి సినిమాని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక వారి ఎక్స్పెక్టేషన్స్ కి రిచ్ అవుతాడో లేదో తెలుసుకోవాలంటే వేచి చూడాలి.

ఈ సినిమా కథ రాసింది కూడా శివ నిర్వాణ నే ఇక దర్శకత్వం కూడా ఆయనే చేయడం గమనార్హం. సాహు గారపాటి హరీష్ పెద్ది ఈ సినిమాకి స్వీయ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. శైన్ సినిమా బ్యానర్ పై ఈ సినిమా ని చూపించబోతున్నారు. ఇక చైతు సమంతా నిజ జీవితం లో కూడా భార్య భర్తాలే.. అయితే ఈ సినిమా లో కూడా వారు భార్య బర్థలుగా కనిపించనున్నారట..! చైతు ఈ సినిమా లో క్రికెటర్ గా కనిపించబోతున్నాడు. సినిమా ట్రైలర్ అయితే ప్రజలని మెప్పించింది.

ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న మజిలీ చిత్రం ప్రీ రిలీజ్ బిజినస్ అద్భుతంగా చేసుకుంటుంది. భారీగా రూ.15 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ రాబట్టుకొన్నది అని ట్రేడ్ వర్గాలు చెప్పుకొంటున్నాయి. ప్రఖ్యాత టెలివిజన్ ఛానెల్ రూ.5 కోట్లు వెచ్చించి శాటిలైట్ హక్కులను సొంతం చేసుకొన్నట్టు సమాచారం. ఇక డిజిటల్ హక్కులు కూడా రికార్డు స్థాయి ధరకు అమ్ముడుపోయినట్టు తెలుస్తున్నది. అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.3.5 కోట్లు చెల్లించి ఈ హక్కులను సొంతం చేసుకొన్నట్టు తెలుస్తున్నది. ఇక డబ్బింగ్ రైట్స్‌తో మరో రూ.4 కోట్లను మజిలీ నిర్మాతలు ఖాతాలో వేసుకొన్నారట. ప్రీ రిలీజ్ ఈ ఇలా ఉంటే సినిమా విడుదల అనంతరం భారీ వసూళ్లు చేస్తుందని నిర్మాతలు నమ్ముతున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: