నా సంబంధం ఉంటే ఊరి తీయండి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మాజీ వ్యవసాయ శాఖ మంత్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి నిన్న తెల్లవారుజామున దారుణంగా తన నివాసంలో హత్యకి గురయ్యాడు.. రక్తపు మడుగుల్లో పడి ఉన్న ఆయన శవాన్ని చూసిన తన పీఏ పోలీసులకి తెలియజేయగా ఆ శవాన్ని చూసిన పోలీసులకి అనేక అనుమానాలు వచ్చాయి..ఇక పోస్ట్ మార్టం నిమిత్తం ఇది హత్యే అని తేలిపోయింది. ఆయన వంటి పై ఏడు కత్తి పాట్లు ఉన్నట్టుగా పోలీసులు వెల్లడించారు. ఈ కేసుని విచారించేందుకు సీట్ బృందం రంగంలోకి దిగింది. కాగా పోలీసులు వారికి వివేకానంద రెడ్డి తండ్రి రాజా రెడ్డి ని హత్య చేసిన నిందితుల్లో ఒకరైయన సుడాకర్ రెడ్డి పై అనుమానాలు ఉన్నాయని వ్యక్తం చేశారు.

గతంలో వైఎస్ రాజారెడ్డి హత్యకేసులో జైలుకు వెళ్లి ఇటీవలే విడుదలైన సుధాకర్ రెడ్డికి సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే, తాజాగా దీనిపై సుధాకర్ రెడ్డి ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ… తనకు ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. హత్య జరిగిన సమయంలో ఇంట్లోనే ఉన్నానని, వివేకానందరెడ్డి ఇల్లు కూడా తనకు తెలియదని ఆయన వ్యాఖ్యానించాడు. గతంలోనూ రాజారెడ్డి హత్యకేసులో తనపై నిష్కారణంగా కేసుపెట్టి అన్యాయంగా ఇరికించారని, దీనికి 12 ఏళ్లు జైలు జీవితం గడపాల్సి వచ్చిందని అన్నారు. తాను జూన్ 10న జైలు నుంచి విడుదలయ్యానని, తనకున్న భూములో వ్యవసాయం చేసుకుంటూ తమ మానాన తాము బతుకుతున్నామని సుధాకర్ రెడ్డి తెలిపారు.

అన్నం తినేటప్పుడు, నిద్రపోయేటప్పుడు తప్పా సమయం వృథాచేయకుండా వ్యవసాయం చేసుకుంటున్నానని పేర్కొన్నాడు. గతంలో అనవసరంగా కేసులో ఇరికించడంతో పన్నెండేళ్లు కుటుంబానికి దూరంగా ఉన్నానని, ఆ బాధను మర్చిపోయి కుటుంబానికి సేవ చేసుకునే ఆలోచనతో ప్రస్తుతం ఉన్నట్టు వెల్లడించారు. వ్యవసాయ తోటలో టమోటాలు కోస్తుండగా తన సోదరుడు ఫోన్‌చేసి వివేకానందరెడ్డి హత్య గురించి తెలియజేసి, తనపేరు వినిపిస్తుందని చెప్పాడన్నారు. ఈ విషయం తెలియగానే తాను పోలీస్ స్టేషన్‌కు వెళ్లానని, అక్కడ ఎస్ఐ లేకపోవడంతో కానిస్టేబుల్‌‌ను కలిసి తనకే సంబంధం లేదని చెప్పినట్టు తెలిపారు. ఈ పన్నెండేళ్లూ తాను ఎంతో బాధ అనుభవించానని, వ్యవసాయం కుంటుపడి కుటుంబం అనేక ఇబ్బందులు ఎదుర్కొందని సుధాకర్ రెడ్డి వెల్లడించాడు. అంతేకాదు తాను తప్పుచేసినట్టు తేలితే ఉరి తీయాలని సవాల్ విసిరారు.

Share.

Comments are closed.

%d bloggers like this: