ఇక రేపటి నుండి జగన్ ప్రచారం షురూ..! నేటికీ వాయిదా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు గురైన నేపథ్యంలో వైఎస్‌ జగన్‌ తన తొలి రోజు ఎన్నికల ప్రచార సభను రద్దు చేశారు. ప్రచార సభలకు సంబంధించి షెడ్యూల్ లో మార్పులు చేశారు వైసీపీ చీఫ్.. ఈరోజు ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించిన అనంతరం విడుదల చేస్తామని గతంలో జగన్ ప్రకటించారు. కానీ తన బాబాయి అంత్యక్రియల కారణంగా ప్రచారాలని రేపటికి వాయిదా వేశారు. అలాగే నేడు వైసీపీ తొలి జాబితాని విడుదల చేస్తామని గతం లో చెప్పారు ఇక దాన్ని కూడా రేపటికి వాయిదా వేయవచ్చు.

రేపు విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నుంచి జగన్‌ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఉదయం 9.30 గంటలకు నర్సీపట్నం, 12 గంటలకు విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని డెంకాడ, సాయంత్రం 2.30 గంటలకు తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలోని అంబాజీపేటలో జరిగే సభల్లో ప్రసంగించనున్న జగన్..

18న ఉదయం 9.30 గంటలకు కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, మధ్యాహ్నం 12 గంటలకు అనంతపురం జిల్లాలోని రాయదుర్గం, 2.30 గంటలకు కడప జిల్లా రాయచోటిలో జగన్ బహిరంగ సభ..

19న ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలోని కొయ్యలగూడెంలో ఉదయం 9.30 గంటలకు, కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో మధ్యాహ్నం 12 గంటలకు,గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలో 2.30 గంటలకు జగన్ సభ.. 20వ తేదీ ఉదయం 9.30 ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో అనంతరం నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో మధ్యాహ్నం 12 గంటలకు, చిత్తూరు జిల్లా పలమనేరులో మధ్యాహ్నం 2.30 గంటలకు జరిగే సభల్లో వైఎస్‌ జగన్‌ బహిరంగ సభలు.

Share.

Comments are closed.

%d bloggers like this: