మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి అంత్యక్రియలు కార్యకర్తల మధ్య అభిమానుల మధ్య కుటుంభ సభ్యుల సమక్షంలో.. పులివెందుల లోని వైఎస్ రాజారెడ్డి ఘాట్ లో నేడు ఉదయం 11 గంటల ప్రాంతం లో పూర్తయ్యాయి. జగన్ విజయమ్మ అవినాష్ రెడ్డి లు ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అంతిమ యాత్ర అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు.
ఈ అంత్యక్రియల్లో వేలాదిగా అభిమానులు పాల్గొన్నారు. అభిమాన నేతలను కడసారి వీక్షించేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అంతకముందు జరిగిన అంతిమ యాత్రలో కూడా జగన్, అవినాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.