Advertisements

కొత్తవారికి సై.. సీనియర్లకి చేయి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నేడు ఉదయం ఇడుపులపాయలో తన తండ్రి సమాధికి నివాళీలు అర్పించిన జగన్ అనంతరం వైసీపీ అసెంబ్లే పార్లమెంట్ అభ్యర్థుల జాబితాని విడుదల చేశాడు. మొత్తం 175 స్థానాల అసెంబ్లీ అభ్యర్థులని 16 స్థానాల పాలమెంట్ అభ్యర్థులని జగన్ ప్రకటించాడు.. ఈ లిస్ట్ లో సీనియర్ లకి స్థానం కల్పించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే కేవలం గెలిచే అభ్యర్థులకే టికెట్ ఇచ్చారని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. ఇందుకు గాను పార్టీలో కీలక పాత్ర పోషించిన వైవి సుబ్భారెడ్డి మేకపాటి రాజమోహన్ రెడ్డి వంటి నేతలనీ సైతం పక్కన పెట్టేశాడు.

గెలుపు కోసమే సిట్టింగ్ లని పక్కన పెట్టినట్టు సమాచారం వస్తుంది. ఇక ఈ జాబితా తయారీ లో అభ్యర్థుల నియామకం లో ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించారట. ఫిల్టర్ చేసి మరీ అభ్యర్థులని నియమించాడట. టికెట్ రాని నేతలతో అసంతృప్తి ఉన్న నేతలతో ముఖాముఖిగా ఆయన చర్చించారట. ఇక ఎంపీ స్థానాల్లో 5 స్థానాలని ఎస్సీ,ఎస్టీ నేతలకి.. 7 బీసీలకి, 13 ఓసీలకి సీట్లు కేటాయించారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతలకి ఎటువంటి రాజకీయ అనుభవం లేని కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు జగన్. గోరంట్ల మాధవ్, మాధవి .. ఇలా పలువురు కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతలకి అవక్షాన్ని కల్పించారు. ఇక సీనియర్లని సైతం పక్కన పెట్టి కొత్తవారికి అవకాశం ఇవ్వడం పై ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు.

Advertisements
Share.

Comments are closed.

%d bloggers like this: