వాహ్ పెంటమ్మ.. నీకు నా పాదాభివందనం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎన్నికలు దేగ్గర పడుతున్న నేపధ్యం లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టేశారు. ప్రజా దర్బార్ పేరిట రోజూ సభలు నిర్వహిస్తూ ముందుకి దూసుకుపోతున్నారు. ప్రజాదర్బార్ సాభాల్లో భాగంగా ఆయన నేడు విజయనగరం జిల్లాలో సభ నిర్వహించారు. ఈ సభకి అశేష స్పందన నమోదయ్యింది. సభ లో ప్రసంగం ముగించుకొని బాబు వేధిక దిగుతుండగా పెంటమ్మ అనే వృద్ధురాలు వేదిక మీదకి వచ్చింది.. ఆ పెంటమ్మ చంద్రబాబు ని ఎంతగానో ఆకర్షించింది. పెంటమ్మ మైక్ తీసుకొని చేసిన నినాదాలు బాబు ని మళ్ళీ వేధిక పైకి వచ్చేలా చేశాయి.

చంద్రబాబు తన ప్రసంగం ముగిసిన వెంటనే వేదిక నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. అదే సమయంలో పెంటమ్మ వేదికపైకి చేరుకుని గట్టిగా నినాదాలు చేయడం ప్రారంభించింది. “ఆ దొంగను నమ్మకండి… మీ ఓటును చంద్రబాబు నాయుడికే వేయండి. బాబు చేసిన మేలును మరువొద్దు. బాబునే గెలిపిద్దాం” అంటూ తన వయసును కూడా లెక్కచేయకుండా ఉత్సాహంగా అరిచింది. తన ప్రభుత్వం పై తన పై నమ్మకం ఉన్న ఆ వృద్ధురాలీని చూసి బాబు భావోద్వేగానికి గురయ్యారు.

అనంతరం వేధిక మీదకి వచ్చిన బాబు మళ్ళీ మైక్ అందుకొని.. మాట్లాడుతూ, పెంటమ్మలో తనకు ఇవాళ రాష్ట్ర ప్రజల కసి కనిపిస్తోందని అన్నారు. ఆమె డబ్బుల కోసం రాలేదని, తెలుగుదేశం ప్రభుత్వం చేసిన మేలును గుర్తించమని ముందుకు వచ్చిందని, అందుకే ఆమె పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. వెంటనే పెంటమ్మ కాళ్లకు నమస్కరించారు. పెంటమ్మ స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో కనిపించాలని ఆశిస్తున్నట్టు చంద్రబాబు తన ప్రసంగం ముగించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: