Advertisements

మొన్న ‘నేనోస్తా కష్టం తీరుస్తా’..! నేడు ‘నేనువిన్న నేనున్నా’..!

Google+ Pinterest LinkedIn Tumblr +

వైసీపీ అధికారంలోకి వస్తే కులమతాలకి అతీతంగా సంక్షేమ పథకాలని అమలు చేస్తామని జగన్ తెలిపారు. రాష్ట్రంలో ప్రజల పడుతున్న కష్టాలను, ఇబ్బందులను ప్రజాసంకల్పయాత్ర ద్వారా తెలుసుకున్నానని ఆయన వ్యాఖ్యానించారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం బస్టాండ్ లో ఈరోజు ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ ‘నేను విన్నాను-నేను ఉన్నాను’ అని ‘యాత్ర’ సినిమా డైలాగ్ చెప్పడంతో ఈ సభాని జనం హర్షధ్వనులతో మార్మోగించారు.

‘పాదయాత్రలో 3,648 కిలోమీటర్ల మేర నడిచా.13 జిల్లాల్లోని ప్రజల కష్టాలు విన్నా. ప్రతి కుటుంబం పడుతున్న బాధను కళ్లారా చూశా. నాడు హోరున వర్షంలో పాదయాత్రలో వెంట నడిచారు. ఇవాళ మండుటెండను సైతం లెక్కచేయకుండా తరలి వచ్చారు. నర్సీపట్నంలో మీ అందరి మధ్య ‘‘వైసీపీకి ఓటు వేయండి, ఫ్యాన్‌ గుర్తుకు ఓటేయండి’’ అని అడిగే ముందు…మాకు అధికారం ఇస్తే….ఏం చేస్తామో చెబుతా. తల్లిదండ్రుల మీద చదువుల భారం లేకుండా చూస్తాం. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ప్రభుత్వ స్కూళ్లను పూర్తిగా మార్చేస్తాం.

వ్యవసాయాన్ని మళ్లీ పండుగ చేస్తాం. గిట్టుబాటు ధలు అందిస్తాం. ఐదేళ్లలో ప్రతీ నిరుపేద కుటుంబాన్ని లక్షాధికారిని చేస్తా. అధికారంలోకి రాగానే వెంటనే 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఉద్యోగాల విప్లవం తీసుకువస్తాం.. మీ సమస్యలన్నీ నేను విన్నాను.. నేను ఉన్నాను అని ఈ వేదిక నుంచి మాట ఇస్తున్నా’ అని జగన్ ప్రకటించారు. దీంతో వైసీపీ నేతలంతా హర్షధ్వనులతో హోరుణ జై జగన్ జై జగన్ అంటూ ఒక్కసారిగా హోరెత్తారు.

Advertisements
Share.

Comments are closed.

%d bloggers like this: