సరిగ్గా నెల కూడా అవ్వలేదు పార్టీ మారి.. అప్పుడే బాబుని విమర్శించడం మొదలు పెట్టేశాడు చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్. ఆయన కొద్ది రోజుల క్రితమే టీడీపీ కి రాజీనామా చేసి వైసీపీ లోకి వచ్చిన విషయం తెలిసిందే. అప్పుడే బాబుని దొంగ అంటున్నాడు ఈ ఎమ్మెల్యే..! బాబు రాజకీయం పై దుమ్మెత్తి పోస్తున్నాడు. తాజాగా ఆయన చంద్రబాబు పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలంతా ఆయన పరిపాలన పై వేలెత్తి చూపుతున్నారని ఆమంచి అన్నారు.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్యను చంద్రబాబు ఆయన తనయుడు ఇద్దరు కలిసి రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డాడు. ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడి హత్య కి గురయ్యాడంటే చట్టం ఈ స్థాయిలో దిగజారిపోయింది అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు అతని మనుషులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఆయన అతని అనుచరులు కలిసి అవినీతికి పాల్పడుతున్నారని, దోచుకున్న డబ్బంతా దొంగ అకౌంట్లలో దాచుకుంటున్నారని ఆయన అన్నారు. ఇలా ఎంత కాలం దాచుకున్న బయట పడక తప్పదని ఆయన జయలుకి వెళ్ళడం కాయమని ఆయ్న అన్నారు.
పోలీసులని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నాడని ఆయన మండిపడ్డాడు. ఎంతమంది పోలీసులని అడ్డుపెట్టుకున్నా చిరాలలో తనదే విజయం అని ఆయన పేర్కొన్నారు. పోలీసు అడ్డుపెట్టుకొని వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నాడని ఆరోపించారు. ఇలా ఎంత మంది పోలీసులని అడ్డు పెట్టుకున్నా చీరాలలో 30 వేల మెజారిటీ దక్కించుకుంటానని ఆయన ధీమా ఇచ్చారు.