రోజుకొక అంశంతో వస్తా.. అన్నీ బయట పెడతా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

టీడీపీ ని మోసం చేశారని మోసం చేసి వైసీపీ లో చేరారని ఆదాల ప్రభాకర్ రెడ్డి పై నెల్లూరు లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపుగా 25 ప్రాంతాల్లో ఆయన దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఆయన్ ఉన్న ఫ్లెక్సినల్ల దహనం కేస్తున్నారు అక్కడి టీడీపీ కార్యకర్తలు. ఇక దీనిపై స్పందిస్తూ ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు.

ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. నిన్న టిడిపి నేతలు 100 మందితో సమావేశం పెట్టుకున్నారు.. నేనేదో వాళ్ళ అబ్బ సొమ్ము ఎత్తుకుపోయినట్టుగా నానా యాగీ చేసారు. జిల్లా టీడీపీ లో సోమిరెడ్డి ఒక్కడే బతకాలని అనుకుంటున్నాడు.. జిల్లాలో పది స్థానాల్లో టిడిపి ఓడిపోబోతోంది.. నాకు రూ.40 కోట్ల బిల్లు వచ్చినట్లు పత్రికల్లో రాయించాడు.. పత్రిక చేతిలో ఉంది కదా అని ఆ పత్రిక లో అవాస్తవ ప్రచారం చేయించాడు అని ఆయన ఆరోపించాడు. నాకు రావాల్సిన బకాయిల్లో రూ 7 కోట్లు మాత్రమే వచ్చాయి. మాకు రావలసిన బిల్లులు మంజూరు చేస్తే వాళ్ళ తాత ఆస్తి నోక్కెసినట్టుగా మాట్లాడుతున్నారు. నా దిష్టిబొమ్మలు ఫ్లెక్సీలు తగలేస్తున్నారు నేను ఎవరి ఆస్తి దోచేయలేదు.. సోమిరెడ్డి వల్ల జిల్లా టీడీపీ సర్వ నాశనం అయ్యింది. సోమిరెడ్డికి దమ్ము ఉంటే నెల్లూరు రూరల్ లో పోటీ చేయాలి. సోమిరెడ్డి సంగతేంటో తేలుస్తా… రోజుకు ఒక్కక్క అంశంతో ముందుకొస్తా.. సోమిరెడ్డి లాగా దిగజారిపోయి విమర్శలు చేయను సాక్షాలతోనే ముందుకొస్త అని ఆయన హెచ్చరించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: