మనోహర్ పారికర్ కి ప్రత్యేక సంతాపం @ 10 గంటలకి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నాలుగు సార్లు ముఖ్యమంత్రి.. మనోబలానికి మారు పేరు..! నూతన గోవా కి కృషి చేసి రూపుకల్పించిన నేత మనోహర పారికార్..! మోనోహర్ పారికర్ ఆత్మస్థైర్యానికి నిజంగానే మారు పేరు..! అసెంబ్లీ లో అతనికి 90 శాతం అటెండెన్స్, అనారోగ్యం తో బాద పడుతున్నా.. డాక్టర్లు సైతం విశ్రాంతి తీసుకోవాలని సూచించిన ఆయన అసెంబ్లీకి హాజరు అవ్వడం గమనార్హం..! కేవలం గోవా లోనే కాకుండా ఆయన దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. నేతలు సైతం ఆయనని ఇన్స్పిరేషన్ గా తిస్కూకుంటున్నారంటే మామూలు మాట కాదు..! అయితే గత కొంత కాలంగా ఆయన పాంక్రియాటిక్ క్యాన్సర్‌ తో పోరాడుతున్నాడు.. ఇప్పటికే విదేశాలకి వెళ్ళి చికిత్స కూడా చేయించుకొని వచ్చాడు.. అయిన ఆ వదలని జబ్బు ఆయన ప్రాణాలు తీసింది. నిరంతరం కృషి చేస్తూ క్యాన్సర్ ఏ సిగ్గు పడేలా ఆయన వ్యాది తో పోరాడారు. కానీ దురదృష్టవాశాత్తు ఆ నిన్న సాయంత్రం 6.40 ప్రాంతానికి ఆయన అస్తమించాడు. గత కొన్ని రోజులుగా అస్వస్థత కి గురయిన ఆయనని ఆయన కుటుంభ సభ్యులు ఆసుపత్రి లో చేర్చారు.. కృస్తృమంగా ఆయనకి శ్వాస ఆడించారు డాక్టర్లు కానీ చిక్త్స చేస్తుండగా ఆయన ప్రాణాలు విడిచారు.

ఆయన మృతికి సంతాపం తెలుపుతూ కేంద్ర మంత్రివర్గం సోమవారం ఉదయం పది గంటలకు ప్రత్యేకంగా సమావేశం కానుంది. కేంద్ర ప్రభుత్వం సోమవారం సంతాపదినంగా ప్రకటించింది. దేశ రాజధానితో పాటు అన్ని చోట్లా జాతీయ పతాకాన్ని అవనతం చేయనుంది. సోమవారం సాయంత్రం పనాజీలో పారికర్‌ అంత్యక్రియలు జరగనున్నాయి.

ఆయన మృతికి సంతాపం తెలుపుతూ రాష్ట్రపతి ట్వీట్ చేశారు..  ఆ ట్వీట్ లో..  ఆయన అంకితభావానికి ప్రతీక అని కొనియాడారు. ‘‘ప్రజాజీవితంలో అంకితభావానికి, నిజాయతీకి మారుపేరుగా మారారు. అనారోగ్యాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఆయన సేవలను దేశంతో పాటు గోవా రాష్ట్రం ఎప్పటికీ మరచిపోవు’’ అని పేర్కొన్నారు.

 

మనోహర్‌ పారికర్‌ ఆధునిక గోవా నిర్మాత అని ప్రధాని మోదీ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ‘‘నిజమైన దేశభక్తుడు, నిరుపమాన నాయకుడు, పరిపాలనా దక్షుడు. దేశానికి ఆయన చేసిన సేవలు తరతరాలకు గుర్తుంటాయి. అందుబాటులో ఉండే గుణం కారణంగా రాష్ట్రంలో అందరికీ ఆమోదయోగ్యుడైన నాయకుడు అయ్యారు’’ అంటూ ఆయన సేవలను గుర్తు చేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: