నీకు దమ్ముంటే.. ఖమ్మం నుండి పోటీ చేయి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

దేశ వ్యాప్తంగా ఎన్నికలు దేగ్గర పడుతున్నాయి. తెలంగాణలో ఎన్నికలు దేగ్గర పడుతున్నా కొద్ది ఒక్కొక్కరుగా కాంగ్రెస్ నీ వీడి టీఆర్‌ఎస్ లోకి చేరుతున్నారు. దీంతో తెలంగాణ లో ప్రతిపక్షం బలహీన పడుతుంది.. అయినప్పటికీ ఉన్న ఎమ్మెల్యే లు ఎంపీ లు గట్టి పోటీకి సిద్ధం అంటున్నట్టుగా విమర్శలు సవాళ్ళు చేస్తున్నారు. ఈ నేపధ్యం లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ కేసీఆర్ పై దీటు వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే ఖమ్మం నుండి పోటీ చేయమని కేసీఆర్ కి సవాళ్ విసిరారు.

ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రజలకు మరో సారి అబద్ధం చెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నాడు.. ఫెడరల్ ఫ్రంట్ ఏమైంది..? మళ్ళీ జాతీయ పార్టీ పెడుతా అంటున్నావు.. అసలు ఫెడరల్ ఫ్రంట్ ఉందా..? నీ కొడుకేమో మా తండ్రి ప్రదాని అంటున్నాడు నువ్వేమో జాతీయ పార్టీ పెడుతా అంటున్నావు మీకు నచ్చిందల్లా చెప్పుకుంటూ పోతున్నారు. జాతీయ పార్టీపెడుతా అంటే మేము స్వాగతిస్తాము జాతీయ స్థాయిలో ఎదుర్కోవడానికి మేము సిద్ధం..!

కేసీఆర్ మొదటి మీటింగ్ లొనే ప్రజలు నిరాశ చెందారు. ఏపీలో 16 లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించారు..మీరు 19వేలు కూడా కట్టలేదు కట్టించనప్పుడు మీకు మాటాలెందుకు. తెలంగాణలో సరిగ్గా అధికారం చేయకుండా ఆంధ్ర రాజకీయాలలో దూరుతున్నావు. ఇప్పుడున్న ఎంపిలే కదా మొన్నటివరకు ఉన్నది. ఇన్నిరోజులు ఏమి చేయని ఎంపీలు ఇప్పుడు ఏమి చేస్తారు..? ఫెడరల్ ఫ్రంట్ ఫెయిల్ అయింది.. ఒక్కొక్క ఎమ్మెల్యేకు 25కోట్లు, కార్పొరేషన్ పదవులు ఇచ్చి కొంటన్నారు. కేసీఆర్ కి సవాల్ చేస్తున్నా…నీకు దమ్ముంటే ఖమ్మం నుండి పోటీ చేయి.

Share.

Comments are closed.

%d bloggers like this: