నామినేషన్ వేసిన అసదుద్దీన్ ఓవైసీ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

హైదరబాద్ శాసనసభ అనగానే గుర్తొచ్చే పార్టీ ఎం‌ఐ‌ఎం. ఇప్పటిది కాదు ఈ చరిత్ర అసదుద్దీన్ తండ్రి ఈ పార్టీని పెట్టినప్పటినుండి వారికి హైదరబాద్ కంచుకోట అనే చెప్పాలి.. ప్రత్యర్ధులు ఎంత కష్టపడ్డా గెలుపు మాత్రం ఎం‌ఐ‌ఎం దే. ఆ పార్టీ స్థాపించినప్పటినుండి హైదరాబాద్ లో గెలుస్తునే ఉంది. ఇక తన తండ్రి తరువాతా అదే స్థాయిలో ఆ పరంపర నీ కంటిన్యూ చేస్తున్నాడు అసదుద్దీన్ ఓవైసీ. ఇప్పటికే వరుసగా మూడు సార్లు మూడు పర్యాయాలని ఆయన సొంతం చేసుకున్నాడు. ఇక ఈ సారి కూడా గెలుపు నాదే అనే ధీమా నీ ఆయన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సంధర్భంగా ఆయన నేడు హైదరబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి నామినేషన్ పత్రాలని డాఖాలు చేశారు. తన నామినేషన్ పత్రాలని ఆయన ఎన్నికల సంఘం యాజమాన్యానికి అప్పగించారు. తన సన్నిహితులతో ఈ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సంధర్భంగా ఆయన పత్రాలను అధికారులకి అందిస్తున్నప్పుడు తీసిన ఫోటోని ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: