నెల్లూరు సభలో జగన్ కేసీఆర్ మోదీ లని ఏకీ పారేసిన బాబు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల జోరు ఊపందుకుంది.. అధినేతలిద్దరూ వరుస సభలు నిర్వహిస్తున్నారు. రోజుకొకటి రెండు కాదు ఏకంగా రోజుకి 3, 4 జిల్లాలు 3, 4 సభల్లో పాల్గొంటున్నారు. వరుస సభలతో కార్యకర్తల్లో పార్టీ అభిమానుల్లో జోష్ నీ పెంచుతున్నారు. నేడు తెద్లుఫు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నెల్లూరు లో సన్నాహక సమావేశం లో పోల్గొన్నారు. సభ కి భారీ స్పందన లభించింది.. ఇక చంద్రబాబు మైక్ అందుకున్నారు..

ఆయన మాట్లాడుతూ..65 లక్షల మంది కార్యకర్తలు ఉన్న ఏకైక పార్టీ టీడీపీ పార్టీ. వైసీపీ దొంగల పార్టీ, కోడి కత్తి పార్టీ అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఇక వారి పార్టీలో చేరిన నేతలనీ ఉద్దేశిస్తూ.. ఆ నేతలు ఐదేళ్లు వారి పనులకు, స్వార్ధానికి వాడుకుని అందరి మధ్య చిచ్చులు పెట్టి టికెట్ ఇచ్చాక పార్టీ మారిపోయారు. ద్రోహం చేసిన అలాంటి వ్యక్తిని ఖచ్చితంగా ఓడించాలి అని ఆయన ప్రజలని కోరారు.

కార్యకర్తల త్యాగాల వల్లే ఇవాళ టీడీపీ ఇంత స్థాయికి వచ్చింది అని ఆయన పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో పది అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు గెలుస్తున్నాం. రైతాంగానికి చివరి ఆయకట్టు వరకు నీరు ఇచ్చేలా ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్నాం. గోదావరి, పెన్నాను అనుసంధానం చేసి నెల్లూరు జిల్లా నీటి సమస్యను పరిష్కరిస్తాం. నెల్లూరు జిల్లా అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తాం అని ఆయన చెప్పుకొచ్చారు.

తిరుపతికి రైల్వే డివిజన్, దుగ్గరాజ పట్నం పోర్ట్ ఏర్పాటుకు కృషి చేస్తా. రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆయన వెల్లడించారు. సంక్షేమ కార్యక్రమాలకు 30 వేల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చాం. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యను ఎందుకు దాచిపెట్టారు, ఎందుకు ఉలిక్కి పడ్డారు అని ఆయన వైసీపీ నేతలనీ ప్రశ్నించాడు. గుండెపోటుతో మరణించారని ఎందుకు ప్రచారం చేసి మభ్యపెట్టారు..? బాబాయ్ అంటే లెక్క లేదు, హత్యను దాచిపెట్టి రాజకీయం చేస్తున్నారు అంటూ ఆయన జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు.

పరిటాల రవీంద్రను మన పార్టీ కార్యాలయంలో దారుణంగా హత్య చేశారు. హత్యా రాజకీయాలు మాకు తెలియవు, ప్రజా తీర్పును త్వరలో మీరు చూస్తారు. దొంగలను కాపాడేందుకు మోడీ విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. నా దగ్గర పనిచేసిన వ్యక్తి కేసీఆర్, ఇప్పుడు నన్ను తిడుతున్నాడు. సమస్యలపై పోరాడకుండా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అని ఆయన మండిపడ్డారు.

Share.

Comments are closed.

%d bloggers like this: