ని రిటర్న్ గిఫ్ట్ తో పాటు మరో పది నీకే తిరిగిస్తా- బాబు

Google+ Pinterest LinkedIn Tumblr +

చంద్రబాబు వరుస సభలతో మెరుపు ప్రచారాలు చేస్తున్నారు. ప్రచారాలలో తాము చేసింది చెబుతూనే ప్రతిపక్ష నేతలపై నిప్పులు చెరిగారు. ఈరోజు అనంతపురం లో సభ నిర్వహించిన ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ తో పాటు జగన్ పి కూడా విమర్శలు గుప్పించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ఇది వరకే అన్నారు.. ఇక దాని పై స్పందిస్తూ కేసీఆర్ ఒక రిటర్న్ గిఫ్ట్ ఇస్తే కేసీఆర్ కి 10 రిటర్న్ గిఫ్ట్ లు ఇస్తానని ఆయన కేసీఆర్ ని హెచ్చరించారు. కేసీఆర్ డబ్బు రాజకీయం చేస్తున్నాడని ఆ డబ్బుకి ఏపీలో ఓట్లు రావంటూ ధ్వజమెత్తారు. ఏం చేశాడని జగన్‌కు 22 ఎంపీ సీట్లు వస్తాయంటూ ప్రశ్నించారు చంద్రబాబు.

జగన్‌ను కేసీఆర్ పావుగా ఉపయోగించుకుని ఏపీకి దెబ్బకొట్టాలని చూస్తున్నారంటూ చంద్రబాబు ఆరోపించారు. 16 సీట్లు ఇస్తే చక్రం తిప్పుతానని అంటున్న కేసీఆర్ తెలంగాణను ఏమైనా అభివృద్ధి చేశావా అంటూ నిలదీశారు. తెలంగాణలో ఏమాత్రం అభివృద్ధి చేయని కేసీఆర్ 16 ఎంపీ సీట్లు గెలిస్తే ఏపీకి ఎంతో చేసిన టీడీపీ ఎన్ని సీట్లు గెలవాలో మీరే నిర్ధారించాలని ప్రజలను అడిగారు.

Share.

Comments are closed.

%d bloggers like this: