వైఎస్ వివేకా కూతురి ఆవేదన..! తప్పుడు కథనాలు వద్దు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

వైఎస్ రెడ్డి హత్య కేసు గురించి కొత్తగా ఏమి చెప్పక్కర్లేదు.. గుండెపోటు అంటారు హత్య అంటారు.. ఒకరి పై ఒకరు ఆరోపణలు చేసుకుంటారు.. సిట్ ఇన్వెస్టిగేషన్ వద్దని సీబీఐ దర్యాప్తు కావాలని కోరతారు. సొంత మనుషులే చేశారని టీడీపీ వాళ్ళంటే టీడీపీ పెద్దల హస్తం ఉందని వైసీపీ వాళ్ళంటారు. ఇక పోతే అనుచరులతో విభేదాలే హత్యకి దారి తీసాయని 15 రోజుల ముందే స్కెచ్ వేశారని పోలీసులు చెబుతారు. ఈ కేసులో రాజకీయం ఎక్కువగా కనిపిస్తుంది నిజనిజాలు బయటకి రావడం లేదు. ఇంతకీ ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు మరో కొద్ది రోజుల్లో పూర్తిగా కూపి లాగి నిజాన్ని వెల్లడిస్తామని సిట్ బృందం కడప సీపీ రాహుల్ దేవ్ శర్మా వెల్లడించారు.

ఇక ఇలా అందరి నోట ఇదే మాట ఈ విషయం పై చర్చ ఉండటం చూసి వివేకా కూతురు మీడియా ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని రాజకీయం చేయవద్దని నిజాలు పోలీసులు బయటకి తీస్తారని ఆమె అన్నారు. ఇలా అందరూ మాట్లాడుతుంటే కూతురుగా తనకి ఎంతగానో బాద కలుగుతుందని ఆమె అన్నారు. ఆమె మాట్లాడుతూ.. మా నాన్నతో చిన్నప్పటి నుంచి మంచి అనుబంధం ఉందన్నారు వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత. పులివెందుల, పట్టణ ప్రజలు, పక్కనే ఉండే తోటలు అంటే చాలా ఇష్టమని, హైదరాబాద్‌ కంటే ఇక్కడ గడిపేందుకే వివేకా ఇష్టపడేవారన్నారు. ప్రజలు ముందు కుటుంబం తర్వాత అనే సిద్ధాంతాన్ని నాన్న ఫాలో అయ్యేవారని సునీత తెలిపారు.

గత కొద్దికాలంగా అమ్మకు కూడా ఆరోగ్యం బాలేదని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండటంతో ఆమె తన వద్దే ఉండేదన్నారు. దీంతో నాన్న ఒక్కరే ఒంటరిగా పులివెందులలో ఉంటున్నారని సునీత వెల్లడించారు. నాన్న స్నేహితులు, అనుచరులు ఆయనను బాగా చూసుకునేవారని తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి పడుకునే వరకు ఎవరో ఒకరు పక్కనే ఉండేవారని ఆమె తెలిపారు. నాన్న మరణం తనను తీవ్రంగా కలచివేసిందని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. హత్య తర్వాతి రోజు నుంచి మీడియాలో వస్తున్న వార్తలను చూస్తే మరింత బాధ కలుగుతుందన్నారు.

ప్రత్యర్థులు ఆయనను అత్యంత దారుణంగా హతమార్చారని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన వాళ్ల గురించి ఎప్పుడూ చెడుగా మాట్లాడకూడదు. గౌరవించకపోయినా పర్లేదు కానీ అవమానిస్తున్నారన్నారు. దర్యాప్తు బృందం విచారణను సరిగా నిర్వర్తించడం లేదని ఆమె ఆరోపించారు. విషయం పక్కదారి పట్టిస్తూ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపుతున్నారని సునీత ఎద్దేవా చేశారు. జగనన్న ముఖ్యమంత్రి కావాలని నాన్న ఎంతో కష్టపడ్డారు. మా కుటుంబంలో మొత్తం 700 మండి ఉన్నారని ఎప్పుడూ ఎవరి మధ్య విభేదాలు లేవని సునీత స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు కథనాలు ప్రచారం చేయొద్దని ఆమె మీడియాకు సూచించారు.

సిట్ బృందాన్ని ఏర్పాటు చేసినప్పటికీ వారికి ప్రభుత్వం స్వతంత్రత ఇవ్వలేదని సునీత ఆరోపించారు. మా ఇంట్లో అన్ని రకాల మనుషులు ఉన్నారని ఒకరంటే ఒకరికి ప్రేమ, గౌరవం ఉన్నాయన్నారు. మా కుటుంబంలోని అనుబంధాన్ని అర్ధం చేసుకోవాలంటే దానికి ఎంతో పరిణితి ఉండాలన్నారు. ప్రతి సంవత్సరం వీలైనప్పుడల్లా ఫ్యామిలీ మొత్తం ఒక చోట కలుస్తామని సునీత వెల్లడించారు. ఈ ఏడాది ఇప్పటికే రెండు సార్లు కలుసుకున్నామని చెప్పారు. ఇంత పెద్ద కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్థలు ఉండం సహజమేనని, వాటినే అర్థం చేసుకునే పరిణితి కూడా తమకు ఉందని సునీత స్పష్టం చేశారు. పెద్ద వాళ్లు నోటికొచ్చినట్లు మాట్లాడితే దానికి పెద్ద ప్రభావం ఉంటుందని అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సునీత సూచించారు.

విచారణను ప్రభావితం చేసేలా వ్యవహరించొద్దని సునీత విజ్ఞప్తి చేశారు. ఆ రోజు పోలీసులకు ఇచ్చిన లెటర్‌లో ఉన్నది మా నాన్న చేతి రాతో కాదో ఫోరెన్సిక్ ల్యాబ్ ధ్రువీకరిస్తుందని సునీత స్పష్టం చేశారు. తనకు, తన కుటుంబానికి కావాల్సింది పారదర్శకమైన విచారణ అన్నారు. తప్పుడు కథనాలు, తప్పుడు స్టేట్‌మెంట్లు పేపర్లో వస్తున్నాయని… సిట్‌ని తన పనిని తాను చేయనిస్తే వాస్తవాలు బయటికొస్తాయని సునీత తెలిపారు.

Share.

Comments are closed.

%d bloggers like this: