మెట్రో.. తో అనేక లాబాలు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

హైదరబాద్ లో మెట్రో రైళ్లు సందడి చేస్తున్నాయి. మెట్రో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. సమయం అదనం చేసుకోవచ్చు కాలుష్యం నుండి తప్పించుకోవచ్చు హాయిగా ఏసీ లో కూర్చొని ప్రశాంతంగా గమ్యాన్ని చేరుకోవచ్చు. ప్రభుత్వానికి కూడా మెట్రో చాలా లాభం.. ఒక్క బస్సు హయత్నగర్ నుండి సెకింద్రాబాద్ వెళ్లడానికి అయ్యే కార్చుతో మెట్రో రైలు పది త్రిప్పులు వేయగలదు. అంటే దాదాపుగా పదింతల ఖర్చు అదనం అవుతుంది..ఈ విషయం ఇలా ఉంటే.. ఐటీ ఉద్యోగులు ఎంతో కాలంగా వేచి చూస్తున్న అమీర్పెట్ హైటెక్ సిటీ మెట్రో రైలు ప్రారంబమయ్యింది. గవర్నర్ నరసింహన్ ఉదయం 9.30 గంటలకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో రైలు ప్రారంభమయ్యింది. ఇక నాగోల్ నుండి హైటెక్ సిటీ వెళ్లాల్సిన ఐటీ ఉద్యోగులు కేవలం ఒక్క రైలు ఎక్కితే గమ్యం చేరిపోతారు. ఇక ఎల్బీ నగర్ మియాపూర్ స్టేషన్ లో ఎక్కిన వాళ్ళు మాత్రం ట్రైన్ మారాల్సి ఉంటుంది. ఈరోజు సాయంత్రం 4 గంటల నుండి మెట్రో రైళ్లు ప్రారంబమవుతాయి.

సరిగ్గా 18 నిమిషాల్లో అమీర్పెట్ నుండి హైటెక్ సిటీకి చేరుకోవచ్చు. అదే నాగోల్ నుండి 55 నిమిషాల్లో చేరిపోవచ్చు. ఇక రోజూ ట్రాఫిక్ లో వెళ్ళి కాలుష్యం బారిన పడటం సమయం వృధా చేసుకోవడం కంటే ఇది చాలా ఉత్తమం అని ఉద్యోగులు భావిస్తున్నారు. ఇక మెట్రో సేవలతో ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా మూడున్నర లక్షల మండి ఉద్యోగులు రోజు వారి హైటెక్ సిటికీ బయలుదేరుతున్నారు.. ఇక వారికి మెట్రో పడటం తో కొంత ఉపశమనం కలుగుతుంది. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్, పెద్దమ్మగుడి, మాదాపూర్‌ స్టేషన్లు ప్రారంభానికి మరికొద్ది సమయం పడుతుందని మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు.

Share.

Comments are closed.

%d bloggers like this: