కాంగ్రెస్ ని ఖతం పట్టిస్తున్న కేసీఆర్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులు చూస్తుంటే మరికొన్ని రోజుల్లో ప్రతిపక్షమే ఉండకుండా పోతుందేమో అనిపిస్తుంది. ఎన్నికలు గెలిచిన నాటికి టీఆర్‌ఎస్ లో 88 ఎమ్మెల్యే లు ఉండగా అది కాస్త ఇప్పుడు 100 కి చేరింది.. కేసీఆర్ అన్నట్టుగా చేశాడు అనే చెప్పాలి.. ఎన్నికలకి ముందు 119 స్థానాల నుండి పోటీ చేసిన కెసిఆర్ మొత్తం వంద స్థానాల్లో గెలుస్తాం అని ఎన్నో సార్లు చెప్పారు.. ఆయన చెప్పినట్టుగా కాకపోయిన 88 స్థానాల్లో గెలిచి బారి విజయం సాధించారు. అప్పుడు 88 మంది ఎమ్మెల్యే లు ఉంటే.. లోక్‌సభ ఎన్నికల దేగ్గర పడుతున్న నేపధ్యంలో… నేటికి అవి కాస్త 100 కి చేరుకున్నాయి. సబితా ఇంద్రరెడ్డి సుధీర్ రెడ్డి లు తాజాగా టీఆర్‌ఎస్ లో చేరారు. ఇక ఇక్కడితో ఆగకుండా మరో ఎమ్మెల్యే కేసీఆర్ తో సన్నాహాలు చేస్తున్నాడు.

బుధవారం నాడు ఉదయం ప్రగతి భవన్‌లో కొల్లాపూర్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో నాలుగు గంటలుగా చర్చలు జరుపుతున్నారు. హర్షవర్ధన్ రెడ్డి కూడ టీఆర్ఎస్‌లో చేరనున్నారని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, సబితా ఇంద్రారెడ్డి, హరిప్రియానాయక్, వనమా వెంకటేశ్వర రావు, సుధీర్ రెడ్డి, కందాళ ఉపేందర్ రెడ్డిలు టీఆర్ఎస్‌లో చేరుతామని ప్రకటించారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి కేసీఆర్‌తో భేటీ కావడంతో ప్రాధాన్యత సంతరించుకొంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హర్షవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై విజయం సాధించారు. ఇక ఆయన కూడా టీఆర్‌ఎస్ లో చేరడం దాదాపుగా ఖరారయినట్టే..!

Share.

Comments are closed.

%d bloggers like this: