తెలంగాణ ఎమ్మెల్యే ఏపీ లో పోటీ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దురుతున్నారని అందరూ అంటున్నారు. కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తాననడం, చంద్రబాబు కేసీఆర్ ని విమర్శించడం.. వ్యాఖ్యలు చేయడం. హైదరాబాద్ లో వైసీపీ సనాహాలు చేయడమే దీనికి తెరలేపాయి. జగన్ తో కలిసి కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నారని. ఈ దిశలో ఎన్నో విచిత్రాలు జరిగాయి. టీడీపీ సీనియర్ లు పార్టీని మారడంలో కేసీఆర్ హస్తం ఉందంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.. ఒక పక్క ప్రచారాలు జరుగుతుంటే మరో పక్క విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి కానీ ప్రచారాలు జోరుగా సాగుతుండటం తో జనం ఈ విచిత్రాలని పసిగట్టలేకపోతున్నారు.
తెలంగాణ సీఎం ఈ కాకుండా తెలంగాణ రాజకీయ నేతలు కూడా ఏపీ రాజకీయం లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సాదారణంగా తెలంగాణ వ్యక్తి ఆంధ్రా లో పోటీ చేస్తే ఓటమి కాయం అని ప్రజలందరికీ తెలుసు. కానీ ఒక తెలంగాణ నేత పేరు ఇప్పుడు ఏపీ లో జోరుగా వినిపిస్తుంది. ఆ పేరే సున్నం రాజయ్య..!

అసలు ఎవరీ సున్నం రాజయ్య :

సున్నం రాజయ్య 2014 లో ఖమ్మం జిల్లా భద్రాచలం నుంచి సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.. సీపీఎం నేతల్లో ఈయనకి మంచి పేరు కూడా ఉంది. తెలంగాణ అసెంబ్లీ లో ఈయన చాలా సార్లు పాల్గొన్నాడు. ఈ విషయం ఇలా ఉంటే ఎన్నికల తర్వాత పోలవరం ప్రాజెక్టు కోసం భద్రాచలం నియోజకవర్గంలోని ఏడు మండలాలను ఏపీలో కలిపారు. దీంతో రాజయ్య స్వగ్రామమైన వీఆర్ పురం మండలంలోని సున్నంవారిగూడెం రంపచోడవరం నియోజకవర్గంలో కలిసింది. ప్రస్తుతం జనసేన పార్టీతో పొత్తులో భాగంగా రంపచోడవరం స్థానం సీపీఎంకు దక్కింది. దీంతో ఆ పార్టీ తరపున సున్నం రాజయ్య బరిలో దిగుతున్నారు. ఒకవేళ ఆయన గెలిస్తే రెండు రాష్ట్రాల అసెంబ్లీలోనూ అడుగుపెట్టిన ఏకైక ఎమ్మెల్యేగా రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది. తెలంగాణ నేతని ఆంధ్ర ప్రజలు ఆశీర్వదిస్తారా తమ నాయకుడిగా గెలిపిస్తారా.. అనే ప్రశ్నలకి ఎన్నికల రిజల్ట్ తరువాతే సమాధానం దొరుకుతుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: