ఆర్‌ఆర్‌ఆర్ లో సంజయ్ దత్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రస్తుతం రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ మల్టీ స్టారర్ సినిమా తెరకెక్కిస్తున్నారు.. జూ ఎన్‌టి‌ఆర్ రామ్ చరణ్ లు హీరోలుగా కనిపించనున్నారు. ఇక ఇద్దరు పెద్ద హీరోలు పైగా రాజమౌళి దర్శకత్వం అంటే ప్రేక్షకులకి ఏ రేంజ్ అంచనాలు ఉంటాయో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. అయితే ఇప్పటికే జాతీయ స్థాయిలో ఫేమ్ తెచ్చుకున్న జక్కన్న ఏ విషయం లోనూ కంప్రమైజ్ కావాలనుకోవట్లేదు. ఈసారి కూడా అదే స్థాయి లో హిట్ కొట్టాలని సన్నాహాలు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులని కూడా తన వైపు తిప్పుకోడానికి ప్లాన్ చేస్తున్నాడు. అయితే అక్కడి మార్కెట్ ని సొంతం చేసుకోవాలంటే అక్కడి యాక్టర్లు కూడా ఉండాలి. దీంతో రాజమౌళి ఈ సినిమాకి బాలీవుడ్ యాక్టర్లని ఎంచుకుంటున్నాడు.

ఇప్పటికే రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బామ ఆళియ భట్ ని తీసుకున్నాడు, ఇక బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారని ఇప్పటికే వెల్లడించాడు.. కథ పెద్దగా ఉండటం వల్ల కథ లో ఇంకొందరి ముఖ్య పాత్రలు ఉన్నాయట ఆ పాత్రలకి కూడా జక్కన్న బాలీవుడ్ యాక్టర్లనే ఎంచుకోవాలని భావిస్తున్నాడు. ఇందుకు గాను ఇప్పటికే చాలా మండి నటులతో చర్చించారని సినీ వర్గాలు చెబుతున్నాయి కానీ రాజమౌళికి మాత్రం ఆ పాత్రల్లో సంజయ్ దత్త్, వరుణ్ ధావన్ లు ఉంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారట. ఇక వారితో ఈ విషయం గురించి కూడా చర్చించారట దాదాపుగా వారి పాత్రలు ఉంటాయనే వ్వినిపిస్తుంది.. కానీ ఈ విషయమై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.

Share.

Comments are closed.

%d bloggers like this: