ఎస్పీవై ఇన్ జనసేన..! పవన్ ఫుల్ హ్యాపీ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎస్పీవై రెడ్డి నంద్యాల పార్లమెంట్ సభ్యుడు.. గత ఎన్నికల్లో వైసీపీ నుండి బరీ లోకి దిగిన ఈయన మంచి మెజారిటీ తో విజయ సాధించారు. ఇక అక్కడ ఆయనకి జగన్ కి విభేదాలు రావడం వల్ల ఆయన గెలిచిన కొన్ని రోజులకే వైసీపీ ని వీడారు. వైసీపీ ని వీడిన అనంతరం ఆయనకి చంద్రబాబు నుండి పిలుపు రావడం తో చంద్రబాబు సమక్షం లో టీడీపీ లో చేరారు. మంచి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిగా ఎస్పీవై ఎడ్డి కి మంచి పేరు ఉంది.. ఈయన గత కొంత కాలంగా అనారోగ్యం తో బాధ పడుతున్నారు దాంతో పార్టీ లో అంతా యాక్టివ్ గా లేరు పైగా.. చంద్రబాబు సర్వేల్లో ఈయనకి ప్రజల తరఫున ఈసారి అంతా సమ్మతం లేకపోవడం వల్ల ఈయానాకి ఈసారి మొండి చేయి చూపారు బాబు.

ఈయనకి మంచి వోట్ బ్యాంక్ ఉంది దీంతో టీడీపీ కి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని భావించాడు. ఇదంతా గమనించిన జనసేన శ్రేణులు ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ తో చెప్పడమే ఆలస్యం పవన్ ఈయనతో మంతనాలు చేసి ఈయనని తన పార్టీ తరఫున పోటీ చేయవలసిందిగా కోరాడు.. పవన్ గాలానికి చిక్కిన ఈనా నేడు ఉదయం జనసేన కార్యాలయం లో పవన్ ని కలిసి ఆయనని ఆలింగనం చేసుకొని పవన్ సమక్షం లో పార్టీ లో చేరారు.. పార్టీ లో చేరిన ఈనని పవన్ కండువా కప్పి సాదరంగా పార్టీ లోకి ఆహ్వానించారు. ఇక జనసేన తరఫున నంద్యాల టికెట్ ఈయనకి కన్ఫామ్ చేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: