పవన్ నామినేషన్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు నామినేషన్ వేయనున్నారు. ఆయన పోటీ చేయనున్న భీమవరం గాజువాక నియోజకవర్గాల్లో నేడు గాజువాక తరఫున నామినేషన్ డాఖాలు చేయనున్నారు. నామినేషన్ వేసిన తరువాత విశాఖ నగరం లో మూడు సభలకి పవన్ పాల్గొననున్నారు. నామినేషన్ వేసిన వెంటనే గాజువాక లో జరిగే బారి బహిరంగ సభ లో పవన్ పాల్గొంటారు. ఆపై మధ్యాహ్నం 3 గంటలకు ఆనందపురం పూల మార్కెట్ బహిరంగ సభ సాయంత్రం 5 గంటలకి ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో పాత జైలు రోడ్డు వద్ద సభ లో పాల్గొంటారు.

జనసేనాని పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి నే అనుసరించబోతున్నారు. చిరంజీవి కూడా 2009 లో ఇలాగే రెండు స్థానాల నుండి పోటీ లో దిగారు. పాలకొల్లు లో తిరుపతి లో రెండు చోట్ల నుండి పోటీ చేశారు.. కానీ తిరుపతి గెలిచి ఆయన సొంత ఊరు పాలకొల్లు లో ఓడిపోయారు. ఇదే తరహా లో పవన్ కల్యాణ్ భీమవరం నుండి గాజువాక నుండి రెండు స్థానాల్లో పోటీ చేయనున్నారు. ఇక రెండు స్థానాల్లో గెలుస్తాడో లేదా అన్న మాదిరే ఒకే స్థానం లో గెలుస్తాడో తెలుసుకోవాలంటే వేచి చూడాలి.

ఇక నేడు 11 గంట ప్రాంతానికి పవన్ గాజువాక లో నామినేషన్ డాఖాలు చేస్యనున్నారు ఇక భీమవరం విషయానికొస్తే ఆయన భీమవరం నుండి శుక్రవారం నామినేషన్ వేస్తారు అని సమాచారం.. నేతలు మాత్రం భారీ స్థాయిలో మెరుపు ప్రచారాలు చేస్తున్నారు. మరి ప్రజలు ఎవర్ని ఆశీర్వదిస్తారో అనేది వాళ్ళకే తెలుసు.

Share.

Comments are closed.

%d bloggers like this: