నారా లోకేశ్ మరోసారి నోరు జారారు.. లోకేశ్ ఇలా చాలా సార్లు నోరు జారారు ఇప్పుడు మరోసారి ఈసారి ఆయన ఎన్నికల తేదీనే తప్పుగా పలికాడు. మంగళగిరిలో ప్రచారం లో భాగంగా లోకేశ్ సభ నిర్వహించారు సభలో ప్రసంగిస్తున్న నారా లోకేశ్ నోరు జారడం జరిగింది.. ఎన్నికల తేదీని తప్పుగా పలికి ఏప్రిల్ 11 న అనబోయి ఏప్రిల్ 9 న అన్నాడు.. ఏప్రిల్ 9 న మీరందరూ తప్పకుండ టీడీపీ కి ఓటు వేయండి ఓటు వేసి టీడీపీ ని గెలిపించండి అని ఆయన అన్నారు. దీన్ని పట్టుకొని దొరికిందే ఛాన్స్ గా జనసేన, వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఆయన వీడియో ని ట్విట్టర్ లో పెట్టి వ్యంగ్యంగా స్పందిస్తున్నారు.
మంగళగిరి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ విషయమై స్పందిస్తూ ఆయన ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారు. లోకేశ్ చెప్పినట్టుగా ఏప్రిల్ 9 న అందరూ టీడీపీ కి వోటెయండి కానీ 77 న మాత్రం ఫ్యాన్ గుర్తు కి ఓటు వేయండి జగన్ ను గెలిపించండి అని ఆయన లోకేశ్ మాటాడుతున్న వీడియో ని ఆ ట్వీట్ కి జోడించి ట్వీట్ చేశాడు. ఇక ఇప్ప్దుడు ఈ ట్వీట్ చాలా వైరల్ అవుతుంది.