భర్త తాగి ఇంటికివచ్చి లేని పోనీ వాటికి వేదిస్తున్నాడని ఆ భర్త పై కూరగాయల కత్తితో దాడికి పాల్పడింది..కోపంతో అతని మర్మాంగాలని కోసేసింది. ఈ ఘటన హైదరబాద్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే రాజస్తాన్ కి చెందిన భార్య భర్తలు షేర్ సింగ్(26) సంతోషిణి(24) జీవనోపాది కోసం హైదరాబాద్ లో స్థిర పడ్డారు. వీరికి నాలుగేళ్ళు లోపు ఉన్న ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రాజా సింగ్ ఎల్బీ నగర్ లోని ఒక మార్బుల్ కంపెనీ లో పని చేస్తున్నాడు. సంతోషిణి ఇంట్లో ఉంటూ పిల్లలని చూసుకుంటుంది. అయితే షేర్ సింగ్ కి మధ్యం సేవించే అలవాటు ఉంది. దీంతో డబ్బు దొరకగానీ కొంత మధ్యం సేవించి ఇంటికి వచ్చే వాడు.
ఈ క్రమం లో తాజాగా మధ్యం సేవించి రాత్రి ఇంటికొచ్చాడు.. లేని పోనీ వంకలు పెడుతూ అనవసరంగా భార్య తో గొడవ పడుతున్నాడు.. ఇద్దరి మద్య వాగ్వాదం పెద్దదయ్యింది. ఇక కోపితు రాలైన భార్య ఆవేశాన్ని అనుచుకోలేక వంటింట్లో ఉన్న కూరగాయలు కోసే కత్తి బయటకి తీసుకొచ్చింది. ముందు ఆ కత్తితో దాడి చేసింది ఆపై ఆయన్ మర్మాంగాలని కోసేసింది.. దాడి సమయం లో పిళ్ళిద్దరూ నిదృస్తున్నారు. ప్రస్తుతం షేర్ సింగ్ ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు అక్కడ ఆయనకి చికిత్స జరుగుతుంది. ఇక ఆ బాదితుడి ఫిర్యాదు మేరకు సంతోషిణి పై కేసు నమోదయ్యింది. కేసు నమోదయినా ఇప్పటి వరకు సంతోషిణిని పోలీసులు అదుపు లోకి తీసుకోలేదు.