కొంత సేపటి క్రితమే ప్రజా శక్తి పార్టు అధినేత కె ఏ పాల్ ఒక టీవీ చానల్ లో లైవ్ కి వచ్చారు. లైవ్ లో ఆయన అన్నీ పార్టీ లపై సెటైర్లు వేశారు.. పగిలిపోయే గ్లాసు కి తుప్పు పట్టిన ఫ్యాన్ కి తుప్పు పట్టిన సైకిల్ కి ఓటు వేయొద్దని కేవలం హెలికాప్టర్ గుర్తు కె ఓటు వేయాలని ఆయన అన్నారు. ఆయాన మాట్లాడుతూ.. తన ముఖ్య టార్గెట్ పులివెందుల అని పులివెందుల నుండే ప్రచారాలు మొదలు పెడతానని ఆయన అన్నారు.. ఆయన ప్రియా మిత్రుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కి గురవ్వడం ఆయనని ఎంతగానో కలచి వేసిందని ఆయన బాధ పడుతున్నానై అన్నారు.. ఈ హత్య కి సంబంధాలు ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన టార్గెటేనని ఆయన అన్నారు. పులివెందుల లో ఆయన హత్య జరిగింది కాబట్టి ఆయన కార్యాచరణ అంతా పులివెందుల నుండే చేస్తానని ఆయన అన్నారు.
ఆయనకి వివేకా కి మంచి సంబంధం ఉందని వివేకా గారి తండ్రి ఉన్నప్పటినుండే ఆయన చేస్తున్న ప్రపంచ శాంతి మిషన్ కి వివేకా శాయపడుతున్నదని ఆయన అన్నారు.. ఆయన ప్రపంచ శాంతి మిషన్ పనులలో బిజీగా ఉన్నప్పుడూ వివేకా ఆయంకి ఎంతో ఇష్టమైన ఇడ్లీ సాంబార్ తీసుకొచ్చేవారని ఆయన తెలియజేశారు. జగన్ తో ఆయనకి గొడవ జరిగినప్పుడే వివేకాని హెచ్చరించినట్టు ఆయన తెలియజేశారు. జగన్ ఒక అవినీతి పారుడని పాల్ వ్యాక్యానించారు. ఇక పోతే చంద్రబాబు దేగ్గర లక్ష కోట్లు ఉన్నాయని జగన్ అంటే జగన్ దేగ్గర 3 లక్షల కోట్లు ఉన్నాయని చంద్రబాబు అన్నారని వీరిద్దరు అవినీతి పరులే ఇద్దరి దేగ్గర లక్షల కోట్లు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. పులివెందుల లో ఆయన అభ్యర్ది దేగ్గర కేవలం లక్ష రూపాయలే ఉన్నాయని ఆయినా జగన్ కి తప్పకుండా ఒడిస్తానని ఆయన అన్నారు.
ఇక పోతే చంద్రబాబు మంచి అడ్మినిస్ట్రేటర్ అని కానీ ఆయన ప్రజలకి హామీలు ఇవ్వడం తప్ప వాటిని నెరవేర్చట్లేదాని పాల్ అన్నారు. బాబు ఇప్పటికే 602 వాగ్దానాలు చేశారని అందులో ఏ ఒక్కటి నెరవేర్చలేదని పాల్ మండిపడ్డారు. ఇక పవన్ గురించి ప్రస్తావిస్తూ పవన్ రాజకీయాలంటే ఏవో డాన్సులు స్టెప్పులు అని భావిస్తున్నారని ఇవి అంతా తేలిక కాదని పాల్ పవన్ పై మండిపడ్డారు.. ఇలాంటి సినీ నటులు ఎందరో రాజకీయాలకి వచ్చారని కమల్ రజిని ల పరిస్తితి ఇప్పుడు ఏంటని ఆయన ప్రశ్నించారు. పవన్ కూడా తన అన్న లాగే పార్టీ పెట్టాడు తన అన్న లాగే ఓడిపోయి మరో పార్టీలోకి పార్టీని విలీనం చేస్తాడని పాల్ అభిప్రాయపడ్డాడు. కాబట్టి ఇలాంటి రాజకీయ నాయకులని నమ్మోదని వీళ్ళందరూ తిరుగుతున్న హెలికాప్టర్ నే నమ్మలని పాల్ ప్రజలని అడుగుతున్నని అన్నాడు.. గ్లాసు ఎలాగో పగులుతుంది, సైకిల్ ఫ్యాన్ తుప్పు పడతాయి కానీ హెలికాప్టర్ కి ఏమి అవ్వడు వీళ్ళందరూ చివరికి హెలికాప్టర్లే ఎక్కుతున్నారని ప్రజలు కూడా కేవలం హెలికాప్టర్ నే నమ్మాలని ఆయన సూచించాడు.
ఇక ఆయనని గెలిపిస్తే ఆంధ్ర ని అమెరికా చేస్తానని రైతులకి ఋణ మాఫీ గిట్టు బాటు దర అందిస్తానని ఇప్పటికే లక్షల కోట్లు ఫండ్స్ తెచ్చి అభివృద్ది చేస్తానని మున్ముందు చాలా చేస్తానని ఒక్కసారి ప్రజా శాంతి మేనిఫెస్టో చూడాలని ఆయన ప్రజలని కోరారు. ఇక ఆయన రేపు ఉదయం 12 గంటలకి నర్సాపురం పార్లమెంట్ స్థానానికి ఆయన నామినేషన్ వేస్తునట్టు పాల్ తెలిపారు.. ఇక ఇంకో గుద్న్యూస్ అంటూ ఇవాళ సాయంత్రం ఆయన నిర్వహించే ప్రెస్ మీట్ లో ఆయన అసెంలి స్థానం గురించి చెబుతానని పాల్ సెలవిచ్చారు.