దువ్వెన కత్తెర పట్టాడు.. కొత్త అవతారం ఎత్తాడు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎన్నికలు దేగ్గర పడుతుంటే నేతలకి ప్రజలమీద ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొస్తుంది.. ప్రచారం చేసే నేతలు వీధి వీధినా తిరుగుతారు. ప్రతి ఒక్కరినీ పాలకరిస్తారు.. తమ పార్టీకి వోటు వేయమని వారిని అడుగుతారు..! టిఫిన్ సెంటర్ కనిపిస్తే వెళ్ళి దోశలేస్తారు.. టీ బండి కనిపిస్తే వెళ్ళి టి చేస్తారు, ఇస్త్రీ కనిపిస్తే ఇస్త్రీ చేస్తారు.. ఎవ్వరిని వదలకుండా అందరినీ కవర్ చేస్తారు.. వల్లని ఆకర్షించి వారి ఓట్లని అడుగుతారు.. ఇదే తరహాలో ప్రస్తుతం రాజకీయ నేతలు ప్రచారాలు చేతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేశ్ ఈ ఎన్నికలకీ మనగలగిరి నియోజకవర్గం నుండి పోటీ చేతున్నారు.. ఆయన మంగళగిరి లో ప్రచారం పనుల్లో బిజీగా ఉన్నారు. ఓటర్లని ఆకర్షించడానికి అన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు..

గుళ్లకి వెళుతున్నారు మసీదులకి వెళ్తున్నారు.. చర్చ్ లకి వెళుతున్నారు మాట పెద్దల దేగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు.. అక్కడికి వచ్చిన ఆ కులం వారందరినీ తమకి వోటు వేయాలని అడుగుతున్నారు.. రోజు సభలు నిర్వహిస్తున్నారు. ఓటర్లని తన వైపు తిప్పుకోవడం లో అస్సలు కంప్రమైజ్ అవ్వట్లేదానే చెప్పాలి. ఇక ఆయన వీధి వీధికి తిరిగి ప్రచారం చేస్తున్నారు ఈ క్రమంలో లోకేశ్ ఒక కటింగ్ దుకాణం కి వెళ్ళి అక్కడ యజమానికి కటింగ్ చేసి మరీ ఓట్లని అడిగాడు.. లోకేశ్ ఓట్ల కోసం బార్బర్ అవతారం ఎత్తారు దువ్వెన కత్తెర పట్టారు మొత్తానికి ఓటర్లని ఆకర్షించడానికి బాగానే కష్టపడుతున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: