అధికారం..వెన్నుపోటు..తప్పుడు రిపోర్టు..! బాబు పై జగన్ ఫైర్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

పులివెందులలో నేడు వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఎన్నికల ర్యాలీ లో పాల్గొన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు. ఓట్లని చీల్చేందుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో చెరీ డ్రామాలు ఆడుతున్నారని ఆయన్ బాబు పై మండిపడ్డారు. నిన్న పవన్ నామినేషన్ వేస్తున్న సమయం జనసేన జందాలే కాకుండా టీడీపీ జందాలు కూడా కనిపించాయని ఆయన అన్నారు.

మాజీ జేడీ లక్ష్మి నారాయణ తో చంద్రబాబు సన్నాహాలు చేశారని ఇందుకుగాను ఆయన భీమిలి నుండి లక్ష్మి నారాయణ కి టికెట్ కూడా ఆఫర్ చేశారని జగన్ అన్నారు. కానీ ప్రజల్లో వ్యతిక్రేకత రావడం తో బాబు తన సీక్రెట్ మిత్రుడు పవన్ కి ఫోన్ చేయగా పవన్ లక్ష్మి నారాయణ కి భీమిలి టికెట్ ఇచ్చారని జగన్ అన్నారు. గతం లో జగన్ పై సీబీఐ విచారణ చేయించింది కూడా బాబే నాని అప్పటినుండి బాబుకి లక్ష్మి నారాయణ కి మంచి మిత్రుత్వం ఉందని ఆయన అన్నారు.

ఇక ఆయన బాబాయి హత్య కేసు గురించి మాట్లాడుతూ.. చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి ఎంతో సౌమ్యుడని ఆయన గుర్తు చేసుకొన్నారు. చిన్నాన్నని వీళ్లే చంపించారని ఆయన మరోసారి టీడీపీపై విరుచుకుపడ్డారు. బురద చల్లేది వీరే.. తప్పుడు ఎంక్వైరీ రిపోర్టులు కూడ ఇచ్చేదీ వీరేనని జగన్ టీడీపీపై విరుచుకుపడ్డారు. బాబుకి అధికారమే ముఖ్యమని అప్పట్లో కూడా అధికారం కోసం తన సొంత మామణి వెన్నుపోటు పొడిచాడని జగన్ అన్నారు. ఇలాంటి మోసం చేసే వాళ్ళు అధికారం లోకి వస్తే యువత భవిష్యత్తు ఏంటని ఆయన ప్రశ్నించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: