నటుడు మోహన్ బాబు పై నటుడు శివాజీ సెటైర్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సినీనటు శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల అధినేత మోహన్ బాబు ఫీజు బకాయిల విషయం పై నిరసనలు తెలియజేస్తూ తిరుపతిలో ధర్నా కి దిగారు. ఇంజినీరింగ్ విద్యార్థులకి ఫీజు రీయింబర్స్ వెంటనే ఇవ్వాలంటూ వెంటనే బకాయిలు చెల్లించాలంటు ఆయన రోడెక్కాడు. ఇక దీనిని సపోర్ట్ చేస్తూ కొందరు విమర్శిలు చేస్తూ కొందరు మీడియా ముందుకి వచ్చారు. ఈ క్రమంలో నటుడు శివాజీ మీడియా ముందుకొచ్చి మోహన్ బాబు పై తీవ్ర విమర్శలు చేశారు.. ఇదంతా కేవలం ఆయన వ్యాపార ప్రయోజనానికే తప్ప ఇంకో కారణం లేదని ఆయన అన్నారు. రాష్ట్రం ఎన్ని జరిగినా ముందుకొచ్చి ఒక్కటి కూడా అడగాని ఈయన ఇప్పుడు వచ్చి ధర్నా చేయడం ఆశ్చర్యం అన్నారు.

ఆయన మాట్లాడుతూ… మోహన్ బాబు విద్యాసంస్థలను వ్యాపార ప్రయోజనాల కోసమే నడుపుతున్నారంటూ ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రయోజనాల కోసం మోహన్ బాబు ఎప్పుడైనా మాట్లాడారా అంటూ నిలదీశారు. హక్కులు అడిగే సమయంలో బాధ్యతలు కూడా గుర్తుకు రావాలి అంటూ సెటైర్లు వేశారు. మరోవైపు మోహన్ బాబు నిరసనపై టీడీపీ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు మోహన్ బాబు పై మండిపడ్డారు. మోహన్ బాబు విద్యాదానం చేస్తున్నారా లేక బిజినెస్ చేస్తున్నారా అంటూ విరుచుకుపడ్డారు. వైఎస్ జగన్ కోసమే మోహన్ బాబు నిరసనకు దిగారంటూ టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: