జనసేన మరో జాబితా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్నాయి.. నామినేషన్లు వేయడానికి ఇంకా 2 రోజులు మాత్రమే మిగిలున్నాయి.. నామినేషన్ వేసేందుకు నేతలు పరుగులు తీస్తున్నారు. ప్రధాన పార్టీలయిన టీడీపీ వైసీపీ జనసేన అధినేతలు ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేసేశారు. అంధరూ తమ తమ అభ్యర్థుల జాబితాలని విడుదల చేసేశారు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటికీ జాబితాలు అంటూ విడతల మాదిరిగా జాబితాలు విడుదల చేస్తున్నారు.. ఆచితూచి నేతలనీ ఎంపిక చేస్తునట్టు ఉన్నారు కానీ ఇదో రకంగా జాప్యం అనే చెప్పవచ్చు ఎందుకంటే నామినేషన్లు దాఖలు చేయడానికి కేవలం రెడ్ను రోజులే ఉంది.. పైగా ఎన్నికలు దేగ్గరకి వచ్చేస్తున్నాయి ఇక నుంచి ప్రతి రోజు ముఖ్యమైన రోజే.. ఇలాంటి సందర్భాల్లో ప్రచారం పనుల్లో బిజీగా ఉండాలి.. నామినేషన్ కి సమయాన్ని అస్సలు వృదా చేయవొద్దు.. మరి జనసేనాని ఏం ఆలోచిస్తున్నారో ఆయనకి మాత్రమే తెలియాలి.

నేడు మరో కీలక 16 స్థానాల జాబితాని ఆయన విడుదల చేశారు..ఇందులో ఏపీ నుండి పోటీ చేసే నేతలు తెలంగాణ నుండి పోటీ చేసే పేర్లు ఉన్నాయి. 16 మంది లో దాదాపుగా 5 పేర్లు అనంతపురం జిల్లాకి చెందిన పేర్లే ఉన్నాయి. పులివెందుల కి సంబంధించిన అభ్యర్థిని హిందూపురం అభ్యర్థి ని పవన్ ప్రకటించారు.. పులివెందుల నుండి తుపాకుల చంద్రశేఖర్ హిందూపురం నుండి ఆకుల ఉమేశ్ ఈ స్థానాల నుండి బరిలోకి దిగనున్నారు.

జాబితాలోని నేతలు వీరే..

అభ్యర్థుల వివరాలు

కృష్ణా జిల్లా:

 1. గుడివాడ- వీఎస్ వీ. రఘునందనరావు
 2. జగ్గయ్యపేట- ధరణికోట వెంకటరమణ

 

గుంటూరు జిల్లా:

 1. పొన్నూరు -బోని పార్వతీనాయుడు
 2. గురజాల-చింతలపూడి శ్రీనివాస్‌

 

కర్నూలు జిల్లా:

 1. నంద్యాల-సజ్జల శ్రీధర్‌రెడ్డి
 2. మంత్రాలయం-బోయ లక్ష్మణ్‌

 

అనంతపురం జిల్లా:

 1. రాయదుర్గం-కె.మంజునాథ్‌ గౌడ్‌
 2. తాడిపత్రి-కదిరి శ్రీకాంత్‌రెడ్డి
 3. కళ్యాణదుర్గం-కరణం రాహుల్‌
 4. రాప్తాడు-సాకే పవన్‌కుమార్‌
 5. హిందూపురం-ఆకుల ఉమేశ్‌

 

కడప జిల్లా:

 1. పులివెందుల- తుపాకుల చంద్రశేఖర్‌

 

నెల్లూరు జిల్లా:

 1. ఉదయగిరి-మారెళ్ల గురుప్రసాద్‌
 2. సుళ్లూరుపేట-ఉయ్యాల ప్రవీణ్‌

 

చిత్తూరు జిల్లా:

 1. పీలేరు -బి.దినేశ్‌
 2. చంద్రగిరి- శెట్టి సురేంద్ర
Share.

Comments are closed.

%d bloggers like this: