పవన్ కామెంట్..! కే‌టి‌ఆర్ ట్వీట్..! మాటకి మాట..!
Google+ Pinterest LinkedIn Tumblr +
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికల్లో మొదటిసారిగా బరిలోకి దిగనున్నారు.. ఈ ఎన్నికల్లో ఆయన తన అన్న చిరంజీవిని అనుసరిస్తున్నారు.. అప్పట్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయన రెండు స్థానాల నుండి బరిలోకి దిగారు అదే ఫార్ములా ని ఇప్పుడు పవన్ ఫాలో అవుతున్నారు. పవన్ కూడా ఇప్పుడు జరగబోయే ఎన్నికలకీ రెండు స్థానాల నుండి బరీ లోకి దిగుతున్నారు ఒకటి భీమవరం మరొకటి గాజువాక ఈమేరకు ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు.. నామినేషన్ అనంతరం ఆయన సభలో పాల్గొన్నారు.. సభ లో పవన్ జగన్ కేసీఆర్ లని దుమ్ము దులిపారు ముఖ్యం గా తెలంగాణ సీఎం కేసీఆర్ ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు..
కేసీఆర్ పై ఆయన ద్వాజమెత్తారు.. తెలంగాణ సీఎం కేసీఆర్ అనవసరంగా ఆంధ్ర రాజకీయాల్లోకి దురుతున్నారని ఆయన విమర్శ చేశారు. ఆంధ్ర నేతలనీ కేసీఆర్ అతని నేతలు తీవ్రంగా తిడుతున్నారని పవన్ మండిపడ్డారు.. తెలంగాణ నేతలు మన వాళ్ళని ఇన్ని తిట్టినా అక్కడి మన నేతలు మాత్రం నోరు మెదపకుండా కూర్చుంతున్నారని ఆయన మండిపడ్డారు. గతంలో పవన్  తెలంగాణలో సభ పెడితే ఆయనని కొట్టడానికి వందల మంది వచ్చారని ఆయన అన్నారు.. నా సభ లొకే దూరి నన్నే కొట్టడానికి వచ్చారని పవన్ తెలిపారు.. అలాంటి వాళ్ళకి ఆయన బయపడనని లక్ష మండి కొట్టడానికి వచ్చినప్పటికీ ఆయన చేలించనని బయపడనని పవన్ అన్నారు. కొడితే చేతులు ముడుచుకొని కూర్చునే టైప్ కాదని పవన్ స్పష్టం చేశారు. ఉద్యమకారుడు అల్లూరి స్పూర్తి తో రాజకీయాల్లోకి వచ్చానని డబ్బు సంపాదించి జేజేలు కొట్టించుకోడానికి రాజకీయాల్లోకి రాలేదని పవన్ అన్నారు..
ఇక ఈయన వ్యాఖ్యలకి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు పలికితే అనవసరంగా విభేదాలు తలెత్తుతాయని తెలంగాణ పై ప్రజల్లో నెగిటివిటీ పెరుగుతుందని ఆయన అన్నారు.. తెలంగాణ లో 29 రాష్ట్రాల వారు హాయిగా బ్రతుకుతున్నారని ఈ విషయం మీకు తెలియకుండా అబూత కల్పనా లో ఉన్నారని తెలంగాణ గురించి తప్పుగా అర్ధం చేసుకున్నారని పవన్ ని పాయింట్ ఔట్ చేశారు. ఇలాంటి లేని పోనీ వ్యాఖ్యల చేయడం సరి కాదని అనుచిత వ్యాఖ్యలు పలకొద్దని పవన్ ని ఆయ్న ట్వీట్ లో ట్యాగ్ చేసి హితువు పలికారు.
I am sure you agree with me that this sort of rhetoric creates undesirable negativity https://t.co/1ApH2Y64Ov
— KTR (@KTRTRS) March 22, 2019
Share.
Comments are closed.
%d bloggers like this: