ఎన్నికలు దేగ్గర పడుతున్నాయి.. నామినేషన్లు దాఖలు చేసేందుకు మరో రెండు రోజులు మాత్రమే మిగులున్నాయి.. ఈ సంధర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రధాన పార్టీలు వైసీపీ టీడీపీ జనసేన అధినేతలు నిన్న నామినేషన్లు దాఖలు చేశారు.. నామినేషన్ దాఖల ప్రక్రియ లో భాగంగా అధినేతలు తమ ఆస్తులను అఫిడేవిట్ ద్వారా వెల్లడించారు.. తాజాగా అవి వెలుగులోకి వస్తున్నాయి. వారి ఆస్తుల విలువ చూస్తే సాధారణ ప్రజలకి కళ్ళు తిరుగుతాయి..! ఒకరిని మించి ఒకరు తమ ఆస్తులని వెల్లడిస్తూ ఈ విషయం లో కూడా పోటీలు పడుతున్నారు.. నిన్న జగన్ దాదాపుగా 650 కోట్ల వరకు ఆస్తులని చూపి కళ్ళు చెదరగొట్టాడు ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఆస్తుల విలువ దాదాపుగా 700 కోట్లు లెక్కల తో సహా చూపెట్టి కళ్ళు జిగేలు మానేలా చేశారు..! విశేషం ఏంటంటే చంద్రబాబు 2014 లో తన ఆస్తుల విలువ 176 కోట్లు చూపెట్టారు.. ఇకపోతే ఈ ఎన్నికలు వచ్చేసరికి ఆయన ఆస్తుల విలువ 700 కోట్లని చేరింది.. ఇక్కడ గమనార్హం ఏంటంటే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఆస్తుల విలువే 669 కోట్లు..!
ఇవే చంద్రబాబు ఆస్తులు :
- చంద్రబాబు స్థిర ఆస్తుల విలువ రూ. 19 కోట్ల 96 లక్షలు
- చంద్రబాబు చిరాస్తుల విలువ రూ. 47 లక్షల 38 వేలు.
నారా భువనేశ్వరి ఆస్తులు :
- నారా భువనేశ్వరి స్థిర ఆస్తుల చిరాస్తుల విలువ మొత్తం కలిపి రూ.669 కోట్లు.
అయితే 2014 లో చంద్రబాబు ఆయన సతీమణి ఆస్తుల విలువ 176 కోట్లు కాగా ఈసారి గడిచిన 5 ఏళ్లలో అది కాస్త 700 కోట్లకి చేరింది.. అంటే దాదాపుగా ఈ ఐదేళ్లలో వారి ఆస్తి 524 కోట్లు పెరిగి ప్రజల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.