నేరకోణాలన్నీ కలిసి కరుడుగట్టిన క్రిమినల్ జగన్- బాబు ట్వీట్లు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు ట్వీట్టర్ వేధికగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ పై నిప్పులు చెరిగాడు.. జగన్ ఒక నేరగాడని దావూద్ ని మించిన క్రిమినల్ అని ఆయన జగన్ పై మండి పడ్డారు. ఇలాంటి నేరగాళ్ళకి ఓటు ఎలా వేస్తారు అని ఆయన జనాన్ని ప్రశ్నించాడు. ఆయన ట్వీట్టర్ వేధికగా గత 15 నిమిషాలలో మూడు ట్వీట్ లు చేశాడు. ముడిటిలోనూ జగన్ ని ఏకీ పారేశాడు.

మొదటి ట్వీట్ లో చంద్రబాబు.. టీడీపీ గెలుపు ఏకపక్షం కావడంతో ప్రతిపక్షానికి దిమ్మతిరుగుతోంది. అరాచకాలను రెచ్చగొట్టే నీచ ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ అరాచక శక్తి అనడానికి అఫిడవిట్ కేసులే నిదర్శనం. 48 పేజీలలో 31 కేసులు జగన్ నేరచరిత్రకు రుజువులు. దేశంలో ఎవరి అఫిడవిట్‌లోనూ ఇన్ని కేసులు ఉండవు అన్నారు.

ఇక రెండవ ట్వీట్ లో.. చిన్నప్పుడే చెడ్డదారి పట్టిన ఆకతాయి బిడ్డ జగన్. దావూద్ ఇబ్రహీంలో ఒకటే ఉగ్రవాద నేరకోణం, నీరవ్ మోదిలో ఒకటే బ్యాంక్ చీటింగ్ నేర కోణం. హర్షద్ మెహతాది ఒకటే ఆర్ధిక నేరకోణం, ఛార్లెస్ శోభరాజ్‌ది ఒకటే హింసావాద నేర కోణం. ఈ నేర కోణాలన్నీ కలిసి కరడుగట్టిన క్రిమినల్ జగన్మోహన్ రెడ్డి.

ఇక మూడవ ట్వీట్ లో.. బిడ్డను ఇచ్చి పెళ్లి చేయడానికి అనేకసార్లు ఆలోచిస్తాం. చదువు-సంస్కారం, ఉద్యోగం చూసి పిల్లనిస్తాం. ఇల్లు అద్దెకు ఇచ్చేముందు ఆలోచించి ఇస్తాం. మరి మన ఓటు వేసే ముందు ఎన్ని ఆలోచించాలి? 31 కేసులున్న వాడికి ఎవరైనా ఓటేస్తారా..? అరాచకాల పార్టీకి ఎవరైనా ఓటేస్తారా..? అని ఆయన ట్వీట్టర్ వేధికగా జగన్ పై నిప్పులు చెరిగారు.

<blockquote class=”twitter-tweet” data-lang=”en”><p lang=”te” dir=”ltr”>చిన్నప్పుడే చెడ్డదారి పట్టిన ఆకతాయి బిడ్డ జగన్. దావూద్ ఇబ్రహీంలో ఒకటే ఉగ్రవాద నేరకోణం, నీరవ్ మోదిలో ఒకటే బ్యాంక్ చీటింగ్ నేర కోణం. హర్షద్ మెహతాది ఒకటే ఆర్ధిక నేరకోణం, ఛార్లెస్ శోభరాజ్‌ది ఒకటే హింసావాద నేర కోణం. ఈ నేర కోణాలన్నీ కలిసి కరడుగట్టిన క్రిమినల్ జగన్మోహన్ రెడ్డి. <a href=”https://t.co/6in77VsAMe”>pic.twitter.com/6in77VsAMe</a></p>&mdash; N Chandrababu Naidu (@ncbn) <a href=”https://twitter.com/ncbn/status/1109380024304656384?ref_src=twsrc%5Etfw”>March 23, 2019</a></blockquote>
<script async src=”https://platform.twitter.com/widgets.js&#8221; charset=”utf-8″></script>

Share.

Comments are closed.

%d bloggers like this: