నాకు భయపడి పవన్ పారిపోయాడు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రపంచ శాంతి అధ్యక్షుడు క్రైస్తవ మత ప్రభోదకుడు ప్రజాశాంతి పార్టీ అధినేత కే ఏ పాల్ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై వ్యంగ్యపు విమర్శలు చేశారు.. పవన్ కళ్యాణ్ తనకి తమ్ముడు లాంటి వాడని తాజాగా ఆయన పార్టీ లోకి చేరిన నాగబాబు కూడా తనకి తమ్ముడేనని పాల్ అన్నారు.. పవన్ కళ్యాణ్ కి ఓట్లే లేవని ఆయన అభిప్రాయపడ్డాడు. అందుకే పొత్తులు పెట్టుకొని కొన్ని ఓట్లు అయిన సంపాదించాలని పవన్ కళ్యాణ్ భావిస్తునట్టు పాల్ తెలిపాడు.

పాల్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ముందు పాలకొల్లు నుండి పోటీ చేయాలని భావించాడని సడన్ గా అక్కడ పాల్ పోటీ చేస్తున్నాడనే వార్తా తెలియగానే ఓట్లు ఎలాగో పడవని ఆకడ నుంచి పోటీకి తప్పుకున్నాడని పాల్ అన్నారు. కేవలం తన పై ఉన్న భయంతోనే పాలకొల్లు నుండి పోటీకి దిగలేదని అక్కడనుండి భీమవరంకి మకాం మార్చాడని పాల్ అన్నారు. నాపై భయం తోనే పవన్ భీమవరంకి పారిపోయారని ఆయన అన్నారు. నాకు పాలకొల్లులో 70 శాతం ఓట్లు ఉన్నాయని ఈసారి పాలకొల్లులో తమదే విజయం అని పాల్ ధీమా వ్యక్తం చేశాడు. పవన్ కి ఓట్లు పడవనే భయంతోనే వామపక్షాలు బీఎస్పీ లతో పొత్తు పెట్టుకున్నాడని అలా పొత్తు పెట్టుకుంటే అయిన కొన్ని ఓట్లు పడతాయని పవన్ పొత్తులపై పాల్ వ్యాఖ్యానించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: