ఆషికి 2 సినిమాతో సినీ ప్రపంచానికి పరిచయం అయిన శ్రద్ధా కపూర్ అప్పటినుండి బిజీగా సినిమాల్లో నటిస్తునే ఉంది.. ఆ సినిమా తరువాత ఆమెకి పెద్ద బ్రేక్ ఎక్కడా దొరకలేదు.. మంచి క్యారెక్టర్లు చేసింది.. సినిమ్ కి తగ్గట్టుగా ఫిజిక్ ని మారుస్తూ తాను బెస్ట్ అనిపించుకుంది. అసలు ఈ అమ్మడు కి 33 ఏళ్ళు అంటే ఎవరైనా నమ్ముతారా..? అలా ఎనర్జీటిక్ గా డ్యాషింగ్ గా కనిపిస్తుంది ఈ భామ..!
ప్రస్తుతం ఈమె సహో సినిమాతో బిజీగా ఉంది. అయితే గత కొంతకాలంగా ఈమే పై అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈమె త్వరలో పెళ్లి చేసుకోబోతుందని గత కొన్నాళ్లుగా రోహన్ శ్రేష్ఠతో అనే ఫోటోగ్రాఫర్ తో ఈమె ప్రేమాయణం సాగిస్తుందని త్వరలో వీరి పెళ్లని ఇలా చాలా వార్తలు వచ్చాయి. ఇలా ఎన్ని రూమర్స్ వచ్చినా శ్రద్ధా ఎప్పుడూ వాటిని పట్టించుకోలేదు. కానీ తాజాగా తెలిసిందెంటంటే అవన్నీ రూమర్స్ కావు నిజాలే..! తాను నిజంగానే రోహన్ తో ప్రేమ లో ఉన్నట్టు త్వరలో వీరు పెళ్లి కూడా చేసుకునే ఆలోచనలో ఉనట్టు సమాచారం. వయసు కూడా 33 వచ్చాయి కాబట్టి ఇంట్లో వాళ్ళు కూడా ఊరికే పెళ్లి ప్రస్తావన తెస్తుండటంతో ఇప్పుడు ఆలోచనలో పడిందట.. ఇక ఈ సమవత్సరం లో అన్నీసినిమాలు ముగించుకొని ఇక వచ్చే ఏడాదిలో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుందట..!