కేసీఆర్ ఇచ్చే రిటర్న్ ఇఫ్ట్ పై బాబు ఎంతగానో ఆస్క్తి చూపుతున్నారని ఆయనకి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ తయారవుతుందని త్వరలో కేసీఆర్ బాబుకి ఇవ్వబోతున్నారని తెలంగాణ నిజామాబాద్ ఎంపీ కవితా అన్నారు. గిఫ్ట్ విషయాలో బాబు కంగారూ పడొద్దని ఆమె సూచించారు. బాబు కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారని ఈ విమర్శలకి తగిన ఫలం కేసీఆర్ త్వరలోనే ఇవ్వబోతున్నారని అన్నీ విమర్శలకి కేసీఆర్ త్వరలోనే స్పందిస్తారని ఆమె స్పష్టం చేశారు.
ప్రస్తుతం కేసీఆర్ తెలంగాణ ప్రజల గురించి ఆలోచిస్తున్నారని ఈ సమయం లో కేసీఆర్ కి తెలంగాణ ప్రజలే ముఖ్యం అని ఆమె అన్నారు. గిఫ్ట్ ఇవ్వడం కాయమని ఇవ్వాల్సిన టైమ్ రాగానే ఆలస్యం చేయకుండా ఇస్తారని ఆమె అన్నారు. తమకి ఎవ్వరితోనూ యుద్దం లేదని చేయాల్సిన సమయం వస్తే వెనక్కి తగ్గేది లేదని ఆమె అన్నారు. ఇప్పుడు జరగబోయే ఎంపీ ఎలెక్షన్లే తమకి ముఖ్యమని ఈ ఎన్నికల్లో కూడా 16 స్థానాలు గెలుస్తామని ఆమె స్పష్టం చేశారు. బీజేపీ నేతలు చేస్తున్న విమర్శల పై కవితా స్పందించారు.. బిజెపి నేతలు తెలంగాణ ఎంపీ లు సాధించిండెమి లేదని ఇప్పుడు కూడా ఏం సాధించారని అన్నారు వాళ్ళకి ధీటుగా టీఆర్ఎస్ ఎంపీలే ఎయిమ్స్, హైకోర్టు, నిజామాబాద్ పెద్దపల్లి రైల్వే లైన్, హైవేలను సాధించుకున్నామని గుర్తు చేశారు కవిత. ప్రతిపక్షాలు విమర్శలు మాని.. ప్రజలకు ఏం చేస్తారో చెబితే మంచిదని సలహా ఇచ్చారు కవిత.