మరోసారి మొండి చేయి..! హరీష్ నే ఎందుకు దూరం పెడుతున్నాడు..?

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో తన కొడుకు కేటీఆర్ కి తెలంగాణా పట్టం కట్టబోతున్నాడని గట్టి ప్రచారం జరుగుతోంది.. కేటీఆర్ కి పట్టం కట్టడానికే తన మేనల్లుడు సిద్దిపేట్ ఎమ్మెల్యే హరీష్ రావు ని దూరం పెడుతున్నాడని కొంత కాలంగా జోరు ప్రచారం జరుగుతుంది. ఇక జరుగుతున్నా సన్నివేశాలు చూస్తుంటే కూడా అలానే అనిపిస్తుంది. కేసీఆర్ కొంత కాలంగా హరీష్ ని పట్టించుకోవడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.. దాదాపుగా లక్ష మెజారిటీ తో గెలిచి తన జిల్లా తన నియోజకవర్గం లోనే కాకుండా అన్నీ నియోజకవర్గాలు తిరిగి టీ‌ఆర్‌ఎస్ గెలుపు గురించి ఎంతగానో కష్టపడ్డాడు హరీష్ రావు. తెలంగాణ ఉద్యమం నాటి నుండే కేసీఆర్ కి వెన్నంటే ఉండి తెలంగాణ సాదన లో తనకంటూ ఒక స్పెషల్ రోల్ సంపాదించుకున్నాడు. తెలంగాణ రాష్ట్రం సాదించారు హరీష్ కృషి కి తగ్గట్టు ఆయనకి మంత్రి పదవిని కూడా అప్పగించారు కేసీఆర్.

ఎంటూ సమర్థవంతంగా మంత్రి పదవిని నిలుపుకున్నాడు ఎన్నో సంక్షేమ పథకాలను హరీష్ చేపట్టారు. దీనికి ప్రతి ఫలంగా మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు హరీష్ ని లక్ష ఓట్ల మెజారిటీ తో గెలిపించారు. ప్రజలు ఆశీర్వదించినా కేసీఆర్ మాత్రం హరీష్ కి మంత్రి పదవిని కూడా ఇవ్వలేదు అలా తన కేబినెట్ నుండి మెల్లిగా పక్కకి జరిపాడు. నేతలు కూడా హరీష్ కి సారైనా గవ్రవామ్ ఇవ్వడం లేదు. ఎన్నికల తరువాత నుండి హరీష్ కేసీఆర్ లు కలుసుకున్న సంధార్భాలు వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. ఇక ఈ విషయం ఇలా ఉంటే తెలంగాణ లో పార్లమెంట్ ఎన్నికలు దేగ్గర పడినట్టే దీంతో ప్రచారం పనులకి వ్యూహాలు దిద్దారు కేసీఆర్.. ప్రచారం చేసే నేతల లిస్ట్ ని రెడీ చేశారు..

అయితే ఇందులో విడ్డూరం ఏంటంటే ప్రతిసారి స్టార్ కేంపెయినర్ ల లిస్ట్ లో హరీష్ కి తప్పకుండా చోటు లభిస్తుంది. కేసీఆర్ తరువాత టీ‌ఆర్‌ఎస్ ప్రచారానికి హెలికాప్టర్ ఎక్కిన నేత హరీషే.. అన్నీ నియోజకవర్గాలు తిరిగి ఎన్నో సార్లు ప్రచారాలు చేశారు.. అలాంటి లిస్ట్ లో హరీష్ పేరు లేదంటూ సమాచారం. ఇక ఈ విషయం లోనూ హరీష్ ని కేసీఆర్ దూరం పెట్టేశారు. దాదాపుగా కేసీఆర్ కేబినెట్ లోని నేతలకే కేసీఆర్ చోటు కలిపించాడు.. 20 మంది లిస్ట్ తయారు చేసి ఎన్నిక సఘానికి పంపారు.. ఆ 20 మంది లో హరీష్ పేరు లేకపోవడం పలు అనుమానాలకి దారి తీస్తుంది. ఆ లిస్ట్ లోని నేతలు వీరే.. కేటీఆర్, మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, జగదీశ్‌రెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, వి.ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, కె.కేశవరావు, జె.సంతోష్ కుమార్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, శేరి సుభాస్ రెడ్డి, ఆర్. శ్రావణ్ కుమార్, బండ ప్రకాశ్, టి.రవీందర్ రావు.

Share.

Comments are closed.

%d bloggers like this: