బాబు సీఎం.. రాజా రెడ్డి హత్య..! బాబు సీఎం.. బాబాయి హత్య!-షర్మిల

Google+ Pinterest LinkedIn Tumblr +

వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల నేడు మీడియా ప్రతినిదులతో మాట్లాడారు.. ఆమె మాట్లాడుతూ తన బాబాయి వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి ప్రస్తావించారు. ఆమె చంద్రబాబు పై టీడీపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పై విమర్శలు ఆరోపణలు చేశారు.. ఈ హత్య తో వారికి సంబంధం ఉందని ఆమె స్పష్టం చేశారు. ఆమె మాట్లాడుతూ.. మా కుటుంబం లో పెద్ద జార్జిరెడ్డి ఆయన్ లేరు తరువాత మా తండ్రి రాజశేఖర్ రెడ్డి ఆయన కూడా లేరు ఇక ఆ తరువాత బాబ్యి వివేకానంద రెడ్డి ఆయనని కూడా చంపేశారు అని ఆమె ఆనింది. మా కుటుంబానికి పెద్ద దిక్కైనా వివేకానంద రెడ్డి ని చంపేశారు అని ఆమె ఆనింది. వివేకారెడ్డిని చాలా ఘోరంగా హత్య చేశారని ఆ హత్య చేసిన తీరుని చూస్తే చాలా దారుణంగా చంపారని తెలుసుతుందని ఆమె అన్నారు.

బాబాయిని చంపిన వాళ్ళు బయట ప్రశాంతంగా తిరుగుతున్నారని.. వాళ్ళు హత్య చేసి నిండా మాపై వేస్తున్నారని ఆమె మండిపడింది. మా కుటుంబం లో అసలు ఎలాంటి గొడవలు లేవు గొడవలు ఉన్నా చంపుకుంటామా అని ఆమె ఆనింది. ఒకవేళ మీ కుటుంబాలలో మీకు ఎవరితోనైనా గొడవలు ఉంటే చంపుకుంటారా అని ఆమె మీడియా ప్రతినిది ని ప్రశ్నించింది. ఈ హత్య టీడీపీ వలె చేశారని ఒక వేళా బాబు కి కానీ ఆదినారాయణ రెడ్డి కి కానీ హత్య తో సంబంధం లేకపోతే థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేషన్ కి ఎందుకు అంగీకరించట్లేదాని ఆమె ప్రశ్నించింది. వాళ్ళే చేశారు కాబట్టి థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేషన్ కి వాళ్ళు ఒప్పుకోవడం లేదని పైగా ఆరోపణలు మాపై వేస్తున్నారని ఆమె అనింది.

ఈ హత్యను తామే చేశామని టీడీపీ నేతలు, చంద్రబాబునాయుడు మాట్లాడడాన్ని ఆమె తప్పుబట్టారు. బాధితులనే నిందితులుగా చేర్చే కుట్ర జరిగితే తాము ఆత్మరక్షణలో పడుతామన్నారు. టీడీపీ నేతలు ఇదే స్ట్రాటజీని అవలంభిస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. మమ్మల్ని ఇలాంటి స్థితి లో పెట్టి అసలైన నిందితులు మాత్రం బయట హాయిగా తిసృగుతున్నారని ఆమె ఆనింది.

ఇప్పుడు జరిగిన మా బాబాయి హత్యలో చంద్రబాబు హస్తం ఉందని.. గతంలో కూడా చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడే రాజా రెడ్డిని కూడా హత్య చేశారని ఇప్పుడు కూడా ఆయనే సీఎం గా ఉన్నపుడే వివేకానంద రెడ్డి ని చంపేశారని ఆమె ఈ రెండు ఘటనలని గుర్తు చేసింది.. అప్పుడు ఆయన సీఎం గా ఉన్నప్పుడే హత్య జరగటం ఇప్పుడు ఆయనే సీఎంగా ఉన్నపుడు హత్య జరగటం ఎంతగానో ఆశ్చర్యానికి గురి చేస్తుందని ఆమె ఆనింది. అప్పట్లో రాజారెడ్డి హత్య లో టీడీపీ నేతల హస్తం ఉంది ఇప్పుడు బాబాయి హత్య లో కూడా టీడీపీ నేతల హత్సం ఉండతూ ఆమె ఆరోపించింది. ఒకవేళ నిజంగానే తమ హస్తం ఏమి లేనప్పుడు థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేషన్ ని అమలు చేయండి అని ఆమె ఆనింది.

Share.

Comments are closed.

%d bloggers like this: