వందల మంది రైతులు..! కనికరం లేకుండా 144 సెక్షన్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం ఒక పక్క వందలాది రైతులు మరోపక్క పోలీసులు..! తెలుగు రాష్ట్రాల్లో నేడే నామినేషన్ వేసేందుకు చివరి రోజు కావడం తో నేతలు నామినేషన్ వేసేందుకు పరుగులు తీస్తున్నారు.. ఈక్రమంలో నిజామాబాద కలెక్టరేట్ కి నామినేషన్ వేసేందుకు వందాలది మంది రైతులు తరలి వచ్చారు.. నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకొని అక్కడ క్యూలు కట్టారు. దీంతో అక్కడి నుండి రైతులని తరలించడానికి తెలంగాణ ప్రభుత్వం 144 సెక్షన్ అమలు చేసింది..! రైతులు ఈ నిర్ణయం పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

గత కొన్నేళ్లుగా నిజామాబాద్ పసుపు, ఎర్ర జొన్న రైతులు తమకి గిట్టు బాటు దర రావడం లేదని ఎన్నో పోరాటాలు చేస్తున్నారు.. ఇలా వీరు ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వం నుండి తమకి ఎటువంటి స్పందన రావడం లేదని ఈసారి వాళ్ళ సమస్య ని జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని నిజామాబాద్ రైతులు భావించారు.. ఈ సంధర్భంగా తమ నిరసన ని అనూహ్య రీతిలో తెలిజ్యజేయాలనుకున్నారు. అక్కడి శాసనసభ బరీ నుండి ఈసారి పోటీ చేయాలని ఇందుకుగాను నైనేషన్లు వేడ్డం అని అక్కడికి తరలి వచ్చారు. నిజామాబాద్ నుండి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవితా లోక్ సభ స్థానానికి పోటీ చేస్తుంది. ఆమె పై రైతుల ఈ చర్య చేపట్టడం గమనార్హం..!

ఇప్పటికే దాదాపుగా 50 మంది ఆమె పై పోటీకి నామినేషన్ వేశారు.. ప్రతి నియోజకవర్గం నుండి ఐదుగురు రైతులు చొప్పున ఆమె పై నామినేషన్ వేయాలని వారు భావించారు.. ఇక ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం ఆందోళన చెందుతుంది, స్వయానా కేసీఆర్ కూతురి నియోజకవర్గం నుండే ఇలా జరగటం తో కాస్త గందరగొయాలనికి తెరే లేచింది. ఒక పక్క రైతులు ఇలా నిరసన చేస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం, ఎంపీ కవితా లు మాత్రం ఇది బీజేపీ చేస్తున్న కుట్ర అని బీజేపీ ఏ కుట్రకి పాల్పడిందని వాళ్ళ పైకి నెట్టేస్తుంది. ఏది ఏమైనా కూడా రైతులు ఈ చర్యకి పాల్పడ్డారంటే ఇది తప్పకుండా ఒక భారీ చర్చనీయాంశమే అని విశ్లేషకులు భావిస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: