నాగ్ అప్పట్లో ‘మన్మథుడు’.. ఇకపై ‘మన్మథుడు 2’..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆ కాలం నుండి ఈ కాలం వరకు ఏకైక మన్మథుడు నాగార్జున. నాగార్జున కి భారీగా లేడి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈయన సినిమా వచ్చిందంటే చాల్లు ఆడవాళ్ళు టీవీ లకి అతుక్కుపోతారు. అయితే ఈయన కెరీర్ లో అద్భుతమైన విజయం గా నిలిచిపోయింది ఎవర్‌గ్రీన్ సినిమా మన్మథుడు.. సినిమా వచ్చి ఇప్పటికీ 16 ఏళ్ళు అయినా ఈ సినిమా వచ్చిందంటే ఇప్పటికీ టీవీలని అతికిపోతారు ప్రేక్షకులు. వినోదం ప్రేమ ఫ్యామిలీ సాన్నివేశాలకి ఈ సినిమా కేర్ ఆఫ్ అడ్రెస్..! ఈ సినిమా లో నాగ్ సరసన సోనాలీ నటించింది. ఇక అప్పటి నుండి నాగ్ కి మన్మదుడు అని పేరు కూడా  పడిపోయింది అప్పటినుండి అందరూ ఈయనని టాలీవుడ్ మన్మదుడు అని పిలుస్తుంటారు కూడా. ఇక ఆయనకే బిరుదునిచ్చిన అలాంటి సినిమా మళ్ళీ వస్తే ఇంకేమైనా ఉందా..

అవును కొంత కాలంగా నాగార్జున మన్మదుడు సినిమా కి సిక్వల్ ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఇలా ప్లాన్ చేస్తున్న టైమ్ కె నాగ్ కి రాహుల్ రవీంద్రన్ అనే డైరెక్టర్ మంచి కథతో దొరికాడు ఇక అంతే కథ నచ్చి ప్రొడక్షన్ లో కూడా పార్ట్ తీసుకుంటున్నాడు. ఇక ఈ సినిమాకి మన్మథుడు2 అనే టైటిల్ ని ఖరారు చేశారు..  నాగ్ సరసన రకుల్ నటించబోతుందట. అప్పట్లో నాగ్ సోనాలీ కాంబినేషన్ అద్భుతంగా వర్కౌట్ అయ్యింది ఇక ఇప్పుడు రకుల్ తో ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. ఇక ఈ సినిమా నేడే  అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి నాగార్జునతో పాటు అమల, నాగచైతన్య హాజరయ్యారు. ఇక ఈ సీనిమాలో వేరే ముఖ్యపాత్రల్లో లక్ష్మి, వెన్నెల కిషోర్,రావు రమేష్, నాజర్, ఝాన్సీ,దేవదర్శిని కనిపించబోతున్నారు. ఆర్‌ఎక్స్ 100 సినిమా కి సంగీతం అందించిన చైతన్య భరద్వాజ్ ఈ సినిమా కి సంగీతం అందించబోతున్నారు. ఈ  సినిమాను మనం ఎంటర్‌ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై నాగార్జున, పి.కిరణ్  సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: