ఏడు కార్లు..! ఏడు కోట్లు..! 70 లక్షల అప్పులు..! ఇవి రోజా ఆస్తులు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ వేసేందుకు నేడే చివరి రోజు ఈపాటికి దాదాపుగా పోటీ చేసే నేతలందరూ నామినేషన్లు వేసేశారు. ఈ సందర్భంగా నగిరి వైసీపీ ఎమ్మెల్యే ప్రముఖ సినీ నటి రోజా నేడు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ వేసే ముందు నేతలు తమ ఆస్తులని లెక్క చేసి అఫిడేవిట్ ద్వారా ఎన్నికల అధికారులకి ఇవ్వవలసి ఉంటుంది. నామినేషన్ వేసిన రోజా తన అఫిడేవిట్ లో పొందుపరిచిన స్స్తుల వివరాలు ఇవే..

రోజా పేరిట ఉన్న ఆస్తుల వివరాలు:

రోజా పేరిట ఉన్న మొత్తం ఆస్తి: రూ.7,38,38,430

స్థిరాస్తి మొత్తం : రూ.4,64,20,669

చరాస్తి మొత్తం : రూ. 2,74,17,761

అప్పులు : రూ.49,85,026

రోజా కార్లు.. మహీంద్రా, ఫోర్డ్‌ ఇండీవర్‌, చవర్‌లెట్‌, ఇన్నోవా క్రిష్టా, ఫార్చ్యునర్‌, హూండా స్ల్పెండర్‌, మహీంద్రా స్కార్పియో కార్లు ఉన్నట్లు అఫిడవిట్ లో పొందుపరిచారు. ఈ కార్ల విలువ రూ.1,08,16,564లుగా చూపించారు. 2017-18లో ఆదాయ పన్ను శాఖకు రోజా రూ.52,63,291లు చెల్లించారు.

ఇకపోతే రోజా భర్త సెల్వమణి పేరుతో ఉన్న ఆస్తులు

స్థిరాస్తి మొత్తం : లేదు

చరాస్తి మొత్తం : రూ.58,02,953

అప్పులు : రూ.22,00,000

వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తుల విలువ: 58,80,000 అయితే 2017-18 సంవత్సరానికి గానూ సెల్వమణి చెల్లించిన ఆదాయపు పన్ను రూ.3,94,518 రూపాయలుగా అఫిడవిట్ లో పొందుపరిచారు.

Share.

Comments are closed.

%d bloggers like this: