జైల్లు బెయిల్లు ఇది మీ చరిత్ర…నారా రోహిత్ లేఖ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

చంద్రబాబు తన తమ్ముడు రామ్మూర్తి నాయుడు ని రాజకీయంగా ఎడగకుండా చేశారని ఆయన అనారోగ్యం తో ఉన్న పట్టించుకోలేదని వైసీపీ నేతలు అన్నట్టుగా వాళ్ళు ఆరోపించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ ఆరోపణలకి రామ్మూర్తి నాయుడు తనయుడు నారా రోహిత్ ధీటు సమాధానం ఇచ్చారు. జగన్ వ్యాఖ్యలకి స్పందిస్తూ ఆయన బహిరంగ లేఖ రాశారౌ దాన్ని ప్రెస్ ముందు రిలీజ్ చేశారు.

ఈ లేఖ లో నారా రోహిత్..  ‘నారా అనే పేరును రాష్ట్ర అభివృద్ధికి బ్రాండ్‌గా మార్చడంలో ముఖ్యమంత్రివర్యులు, మా పెద్దనాన్న శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషి అభినందనీయం. రామలక్ష్మణుల్లా కలిసి ఉండే మా పెదనాన్న, మా నాన్న రామ్మూర్తినాయుడు మధ్య విభేదాలున్నాయంటూ వ్యాఖ్యానించడం బాధాకరం. మీ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం అన్నదమ్ముల మధ్య విభేదాలు సృష్టించొద్దు.

నారా అనే పేరుని నిలబెట్టడానికి మా కుటుంబం నుండి ఒక్కరూ చాలు, దానికి మా పెద్దనాన్న ఉన్నారు అందుకోసమే మేము రాజకీయాల నుండి దూరంగా ఉంటున్నాం.. మా కుటుంబాల మద్య చిచ్చు పెట్టకండి..! నాలుగు దశాబ్దాల క్రితమే మా ఆస్తులని పాఠశాలల అభివృద్ధికి రాసిచ్చేశాము ఈ విషయాన్ని మరువకండి. రాత్రింబవళ్ళు 5 కోట్ల ఆంధ్ర ప్రజలని ఏ విదంగా అయితే చూసుకుంటున్నారో మమ్మల్ని అదే విదంగా చూస్కుంతున్నారు పెద్దనాన్న, ప్రతి సంవత్సరం సంక్రాంతి ని అందరం కలిసిచేసుకుంటాము మా బందుత్వాలపై బురద చల్లకండి అసత్యాలు పలుకకండి. అయినా జైళ్ళకి వెళ్ళి కోర్టులకి బేయిళ్ల కొరకు తిరిగే మీకేం తెలుస్తుంది బంధుత్వాల గురించి. ఒక్క ఎంపీ పదవి కోసం మీ సొంత బాబాయి పైనే చేయి చేసుకున్నా చరిత్ర మీది. మాకు పదవులు ముఖ్యం కాదు. మాది అలాంటి చరిత్ర కాదు అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిలా కాకుండా కుటుంబ పెద్దగా గడుపుతున్నారు మా అందరికీ ఇవ్వవలసిన ప్రాధాన్యత మాకు ఇస్తున్నారు. మా నాన్న ఆరోగ్య పరిస్తితి బాగోలేదు కనుకనే ఆయన ఇంటికి పరిమితం అయ్యారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: