నామినేషన్ దాఖలు చేయడానికి ఇదే చివరి రోజు కావడంతో నేతలు నామినేషన్లు వేసేందుకు పరుగులు తీశారు. అయితే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు మత ప్రభోదకుడు కెఏ పాల్ నామినేషన్ వేసేందుకు సమయం అయిపోయిన తరువాత వెళ్లారు ఇక సమయం అయిపోయిన తరువాత వెళ్లినందుకు ఆయన నామినేషన్ ని ఎన్నికల అధికారులు తిరస్కరించారు. ముందు పాల్ నర్సాపురం నుండి పోటీ చేస్తునట్టుగా ప్రకటించారు కానీ తరువాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం నుండి పోటీ చేస్తునందుకు ఈయన కూడా అక్కడినుండి పోటీ చేస్తునట్టుగా ప్రకటించాడు.
అయితే నామినేషన్ పత్రాలని సాయంత్రం 4 గంటల లోపే అధికారులకి అప్పగించాలని నిభందన ఉంది. పాల్ 3.30 నిమిషాలకే కార్యాలయానికి చేరుకున్నారు ఇక పత్రాలని ఫిల్ చేసి రిటర్నింగ్ అధికారికి 4.10 గంటలకి ఇచ్చారు. కానీ పాల్ 4 గంటలకి ఇవ్వవలసిన పత్రాలని 4.10 నిమిషాలకి అందించినందుకు.. ఆయన నిబంధనలని అతిక్రమించినందుకు ఆయన నామినేషన్ పత్రాలని రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు. దీంతో పాల్ భీమవరం బరీ నుండి పోటీ కి ముందే ఔట్ అయ్యాడని తెలుస్తుంది. ఈ విషయమై పాల్ స్పందిస్తూ నా నామినేషన్ రద్దు వెనుక చాలా పెద్ద కుట్రే జరిగిందని అన్నారు.
ఇక నర్సాపురం నుండి ఆయన పార్లమెంట్ సీటుకి బరిలో దిగనున్నారు. నర్సాపురం లో కూడా నేడే పాల్ నామినేషన్ దాఖలు చేశారు. అక్కడ కూడా ఇలాగే అవకాతవకాలు జరిగాయి పాల్ ఏవో కొన్ని పత్రాలు ఇవ్వలేదట ఇంకా మరి కొంత సమయమే మిగులుండటం తో ఎన్నికల అధికారులు పాల్ కి ఈ విషయం తెలియజేయగా పాల్ తన బంధువులతో కావల్సిన పత్రాలని పంపించారు.