వివేకా కేసులో ఓ ”పోలీసు”.. కొత్త ట్విస్ట్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

వైఎస్ జగన్ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు లో రోజుకొ ట్విస్టు.. రోజుకి ఒక్కసారైయన్ ఈ కేసు వార్తల్లోకి రాక మానట్లేదు. ఒక రోజు ట్విస్టు ఉంటే మరో రోజు కుటుంబ సభ్యులు మీడియాకెక్కుతున్నారు ఇక మరో రోజు రాజకీయ నేతల కామెంట్స్ ఇలా ప్రతి రోజు ఈ కేసు వార్తల్లోకి ఎక్కుతూనే ఉంది. నేడు మరో ట్విస్టు తో ఈ కేసు మళ్ళీ ప్రస్తావనకి వచ్చింది.

పోలీసులు ఈ కేసు విచారణ ముమ్మరంగా చేస్తున్నారు. కేసు విచారణ లో చాలా కష్టపడుతున్నారు. తగిన మార్గాలన్నిటినీ అనుసరిస్తున్నారు. ఈ ఘటన జరిగి చాలా రోజులైనప్పటికీ ఈ కేసు పై మాత్రం ఏమాత్రం క్లారిటీ రావట్లేదు. ఒక్క గట్టి క్లూ కూడా దొరకట్లేదు. ఈ కేసు విచారించేందుకు సిట్ బృంధం శాయ శక్తులా కష్టపడుతుంది. ఇప్పటికే ఈ కేసుకై 62 మందిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. కాగా ఇప్పుడు ఆరో ట్విస్టు బయటపడింది.

హత్య జరగగానే ఘటనా స్థలానికి చేరుకున్న హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ రెడ్డి సాక్షాదారాలను తారుమారు చేశాడట. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆయనని అదుపు లోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.. విచారణలో భాగంగా హత్య జరగగానే అక్కడికి చేరుకున్న రామకృష్ణ రెడ్డి వివేకా దేహాన్ని బెడ్ రూమ్ నుండి బాత్రూమ్ లోకి తరలించారట.. ఇక అక్కడ పఫీనా రక్తపు మరకలని ఆయనే దేగ్గరుండి తుడిపించారట, ఆయన వంటి పై పడ్డ గాట్లకి దేగ్గరుండి కుట్లు వేయించాడట..! ఇప్పటికైతే సిట్ అధికారులు ఈ విషయాలు వెల్లడించారు ఇక త్వరలో మరో అప్డేట్ తో ముందుకొస్తారట.

 

Share.

Comments are closed.

%d bloggers like this: