ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ పై నిన్న రాత్రి నుండి ఒక్కొక్కరిగా టీడీపీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. ఒకరు కాగానే ఒకరు మీడియా ముందుకి వచ్చి జగన్ పై విమర్శలు చేస్తున్నారు. నిన్న జగన్ కేసీఆర్ తో పొత్తు పెట్టుకుంటే తప్పేంటి అన్న వ్యాఖ్యలను కండిస్తూ ఒక్కొక్కరిగా మీడియా ముందుకి వచ్చి ధీటు వ్యాఖ్యలు చేస్తున్నారు. నేడు ఉదయం టీడీపీ అధినేత టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ టెలీకాన్ఫరెన్స్ లో కూడా ఇదే ముఖ్య విషయం గా చంద్రబాబు ప్రస్తావించారు.. జగన్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా అనూహ్య నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
ఇక తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ బుద్ధా వెంకన్న ప్రెస్ మీట్ నిర్వహించారు ప్రెస్ మీట్ లో భాగంగా ఆయన జగన్ పై నిప్పులు చెరిగారు. ఆయన మాట్లాడుతూ.. జగన్ లాంటి వ్యక్తులు పోటీకి అనర్హులని, ఆయన చట్టం లోని లొసగులని చూపించి బరిలోకి దిగుత్న్నారేమో కానీ ప్రజల మనసులోకి ఎలా దురుతారు..? ప్రజల మనసులో జగన్ కు స్థానం లేదు అని ఆయన అన్నారు. ‘కేసీఆర్ తో పొత్తు పెట్టుకుంటే తప్పేంటి?’ అని జగన్ ఎప్పుడైతే అన్నాడో, అప్పటి నుంచే ప్రజలు ‘ఛీ’ కొడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇలాంటి వ్యాఖ్యలు చేసిన జగన్ ని ఆ పార్టీ అభ్యర్థులు కూడా ‘ఛీ’ కొట్టాలని, ఇలాంటి వ్యక్తి దగ్గర ఉండమని బయటకొచ్చేయాలని సూచించారు. జగన్ తండ్రే జగన్ పై ఆనాడు ‘పగ వాడికి కూడా ఇలాంటొ కొడుకు వద్దు’ అని అన్నారట అని బుద్ధా అన్నారు. జగన్ ఒక రాష్ట్ర ద్రోహి..! దేశ ద్రోహులకి ఎలాంటి శిక్ష వేస్తారో రాష్ట్ర ద్రోహులకి కూడా అలాంటి శిక్షలే వేయాలి.. జగన్ ని రాష్ట్రం నుండి బహిష్కరించాలి అని ఆయన జగన్ పై విమర్శలు చేశారు.