నువ్వు భయపడ్డావు..! మా జగన్ దైర్యవంతుడు..!-వాసిరెడ్డి పద్మ

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో నేతలు అందరూ వార్వారి నియోజకవర్గాల్లో ప్రచారాలు పక్కన పెట్టి పార్టీ అధినేతలపై ప్రెస్ మీట్ లు పెట్టి విమర్శలు చేస్తున్నారు. ఎన్నికలు దేగ్గర పడుతున్నాయి ప్రజలకి దేగ్గరవ్వాలి అని చింత వదిలి మా అధినేత అలా మీ అధినేత ఇలా అంటూ ప్రెస్ మీట్ లలో పోటీలు పడుతున్నారు. అధినేతలపై విమర్శలు చేస్తున్నారు. మాటలతో దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలో నేడు ఇప్పటికే టీడీపీ నేతలు దేవినేని ఉమా బుద్ధ వెంకన్న లు ప్రెస్ మీట్ నిర్వహించారు ఇక మేం ఏమి తక్కువ కాదు అన్నట్లు ఇప్పుడు వైసీపీ నేతలు ప్రెస్ మీట్ లు పెడుతున్నారు. తాజాగా వైసీపీ నేత అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో ఆమె టీడీపీ అధినేత చంద్రబాబు పై నిప్పులు చెరిగారు.

ఆమె మాట్లాడుతూ.. ఏపీకి ‘ప్రత్యేక హోదా’ వద్దు ‘ప్రత్యేక ప్యాకేజ్’ ఇస్తే చాలని అన్నది సీఎం చంద్రబాబునాయుడు అని  పద్మ విమర్శించారు. ఇన్నాళ్లూ నోరుమూసుకుని కూర్చున్న చంద్రబాబు, ఇప్పుడు ఎన్నికల్లో గెలుపు కోసం కొత్త డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో ఉన్న చంద్రబాబు కేసీఆర్ ని చూసి భయపడ్డారు. ఆ తర్వాత మోదీని చూసి భయపడ్డది కూడా ఆయనేనని విమర్శించారు. మోదీకి భయపడి స్పెషల్ ప్యాకేజీ ని ఒప్పుకున్నది బాబు కాదా..? అని ఆమె ప్రశ్నించారు.

జగన్ ని చూస్తే చంద్రబాబు వణికిపోతున్నారని, చంద్రబాబు ఎవరిని చూసి అయితే భయపడ్డారో, వాళ్లందరూ జగన్ వెనుక ఉన్నారని ఆయన చెబుతుండటం విడ్డూరంగా ఉందని అన్నారు. చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు, మోదీ కలిసి ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రజలను ఎంతగా మాయ చేయాలనుకున్నారో తెలియని విషయాలు కాదని అన్నారు. మోదీకి భయపడి ప్రత్యేక హాదా వద్దన్నది చంద్రబాబు అని, మోదీకి ఎదురు నిలిచి ఆ హోదా కావాలన్న ధైర్యవంతుడు జగన్ అని ప్రశంసించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: